Begin typing your search above and press return to search.

టీడీపీ - బీజేపీ బందం!...జ‌గ‌న్ కామెంట్ పేలింది!

By:  Tupaki Desk   |   10 Jan 2019 4:13 AM GMT
టీడీపీ - బీజేపీ బందం!...జ‌గ‌న్ కామెంట్ పేలింది!
X
ఏడాది క్రితం దాకా టీడీపీ - బీజేపీ క‌లిసి మెల‌సి సాగాయి. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాయి. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం బ‌య‌ట‌ప‌డేస్తోంద‌ని బీజేపీకి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కితాబిస్తే... బాబు మాబాగా ప‌నిచేస్తున్నార‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు కూడా కొనియాడిన విష‌యం ఇంకా క‌నుమ‌రుగు కాలేద‌నే చెప్పాలి. ఓ వైపు ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రుగుతున్నా కూడా... దానిని పక్క‌న‌పెట్టేసిన టీడీపీ - బీజేపీలు సొంత డ‌బ్బాలు కొట్టుకుంటూ సంబ‌రాలు చేసుకున్నాయి. అయితే ఏడాది క్రితం ఈ రెండు పార్టీలు విడిపోయాయి. ఇప్పుడు ఒక‌దానిపై మరొక‌టి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ త‌రహా విచిత్ర వైఖ‌రిపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదిరిపోయే సెటైర్ సంధించారు. 14 నెల‌ల పాటు 13 జిల్లాలోని 134 అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల‌ను చుట్టేస్తూ సాగించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను నేటి సాయంత్రం ఆయ‌న ముగించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భా వేదిక నుంచి కీల‌క ప్ర‌సంగం చేసిన జ‌గ‌న్‌... టీడీపీ - బీజేపీల బంధంపై సంచ‌ల‌న కామెంట్ చేశారు.

ఈ రెండు పార్టీల మ‌ధ్య కొన‌సాగిన బంధాన్ని చూసి నాడు చిలుకా - గోరింక‌లు కూడా సిగ్గుపడ్డాయ‌ని ఆయ‌న త‌న‌దైన శైలి సెటైర్ వేశారు. నాడు త‌న‌కు అత్యంత విశ్వాస‌పాత్రమైన బీజేపీ - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... ఇప్పుడు చంద్ర‌బాబుకు ఎందుకు దుర్మార్గులుగా క‌నిపిస్తున్నారో చంద్ర‌బాబు చెప్పాల‌ని కూడా జ‌గ‌న్ డిమాండ్ చేశారు. టీడీపీ - బీజేపీ బంధాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ... బీజేపీ - జ‌న‌సేన‌ల‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇటు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డం - అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చాయి. ఫ‌లితంగా ఏపీలో కొలువుదీరిన టీడీపీ స‌ర్కారులో బీజేపీ భాగ‌స్వామి కాగా... కేంద్రంలో అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన ఎన్డీఏ స‌ర్కారులో టీడీపీ కూడా భాగ‌స్వామిగా చేరిపోయింది. రెండు చోట్లా ఈ పార్టీల బంధం నాలుగేళ్ల పాటు బాగానే సాగింది. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా... ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన టీడీపీ... అప్ప‌టిదాకా కొన‌సాగిన ఆ రెండు పార్టీల బంధానికి ముగింపు ప‌లికింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని కార‌ణంగానే బీజేపీతో పొత్తును తుంచేసుకున్నామ‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చెబుతుండ‌గా... ఇదేమీ ఇప్ప‌టికిప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని - ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్న త‌మ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు స‌రేన‌న్నార‌ని - అయినా కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించిన చంద్రబాబు త‌మ‌తో పొత్తును తుంచేసుకున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... నాడు చిలుకా గోరింక‌లుగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ - బీజేపీలు ఇప్పుడు బ‌ద్ధ వైరులుగా ఎలా మారార‌ని కూడా ప్ర‌శ్నించారు. చిలుగా గోరింకలు సిగ్గుతో తలదించుకునేలా ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక మాటలు మార్చారని జగన్ అన్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసి ఉన్నారని - టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నారని - అప్పుడు బీజేపీని పొగుడుతారని, అసెంబ్లీలో బీజేపీని ప్రశంసిస్తూ తీర్మానం చేస్తారని - నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు ముందు మళ్లీ డ్రామాలు ఆడుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా సంజీవినా? అని అడిగారని - హోదా అడిగిన మనలను వెటకారం చేశారని, బీజేపీ ఏపీకి చేసినంతగా ఏ రాష్ట్రానికి చేయలేదని చెబుతారని, ఈ నాలుగేళ్లు టీడీపీ - బీజేపీల తీరు చూసి చిలుకా గోరింకలు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉందని విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబుకు ప్రత్యేక హోదా సహా అన్నీ గుర్తుకు వస్తాయన్నారు. త‌ద‌నంత‌రం ఎల్లో మీడియాను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... ఈనాడు పేపర్లో ఈ మధ్య ఏ రోజు చూసినా చంద్రబాబుకు - మోడీకి యుద్ధం అని ఉంటుందని - నాలుగేళ్లు బీజేపీతో చిలుకా గోరింకల్లా కాపురంలా క‌నిపించిన వారి మైత్రి - ఇప్పుడు యుద్ధంలా కనిపిస్తోందా? అని జగన్ మండిపడ్డారు. రెండు పత్రికలు - అనేక టీవీ ఛానళ్లను అడ్డుపెట్టుకొని చంద్ర‌బాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. జ‌గ‌న్ ప్ర‌సంగం ఆద్యంత ఓ రేంజిలో సాగినా... టీడీపీ - బీజేపీల బందంపై ఆయ‌న సంధించిన సెటైర్ మ‌రింత‌గా పేలింద‌ని చెప్పాలి.