Begin typing your search above and press return to search.
మూడు సింహాల వెనుక నక్క. ఇంతకూ నక్క ఎవరు.?
By: Tupaki Desk | 5 March 2019 2:22 PM GMTడేటా ఫైట్ తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తోంది. టీడీపీ - వైసీపీ మధ్య వార్ కాస్తా టీడీపీ వైసీపీ - వయా టీఆర్ ఎస్ లా మారింది. మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి వైసీపీ - టీఆర్ ఎస్ డ్రామాలాడుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. తమకు అంత అవసరం లేదని.. నిస్సిగ్గుగా దొరికిన తర్వాత కూడా దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉందని టీఆర్ ఎస్ అదిరిపోయే పంచ్ ఇచ్చింది.
పంచ్ ల సంగతి పక్కన పెడితే.. డేటా ఫైట్‌పై తొలిసారిగా రెస్పాండ్ అయ్యారు జగన్. డేటా గురించి చెప్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతికి - న్యాయానికి - ధర్మానికి ప్రతిరూపాలైతే.. ఆ కన్పించని నాలుగో సింహమేరా పోలీస్ అనేది సాయికుమార్ ఫేమస్ డైలాగ్. అయితే.. ఏపీలో మాత్ం మూడు సింహాల వెనుక నక్క ఉందని.. ఏపీ పోలీసులంతా ఆ నక్కి సెల్యూట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. నక్కకు అతి తెలివి ఎక్కువ. ఇక్కడి వేషాలు అక్కడ - అక్కడి వేషాలు ఇక్కడ వేస్తుంది. పరిస్థితులకు తగ్గట్లుగా ఊసరవెల్లిలా మారిపోతుంది. పేరు చెప్పకపోయినా.. జగన్ ఉద్దేశంలో ఆ నక్క ఎవరో అందరికి అర్థం అయిపోయింది. దీంతో.. జగన్ కూడా డేటా ఫైట్ పై అదిరిపోయే పంచ్ వేశాడని.. అది ఎవరికి చేరాలో వారికి చేరిందని వైసీపీ వర్గాలు సంబరపడిపోతున్నాయి.