Begin typing your search above and press return to search.
బాబుపై జగన్ లెటెస్ట్ పంచ్ లు విన్నారా?
By: Tupaki Desk | 23 Dec 2018 5:21 AM GMTనోరేసుకొని నచ్చనోడి మీద పడిపోవటం అందరూ చేసేదే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలువురు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వారికి మినహాయింపుగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాబుపై విమర్శల్ని సంధించే విషయంలో ఆయన చూపించే ఉదాహరణలు.. ప్రస్తావించే అంశాల్లో లాజిక్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.
బాబును ట్రాక్ చేయటం.. ఆయన మాటల్ని మ్యాప్ చేయటంలో జగన్ తర్వాతే ఎవరైనా. తన ప్రత్యర్థి బలహీనతల్ని గుర్తించే విషయంలో జగన్ తర్వాతే ఎవరైనా. దేశంలో పలువురు విపక్ష నేతలు ఉన్నా.. జగన్ మాదిరి అధికారపక్ష నేతపై పక్కా ఆధారాలతో ఆరోపణలు చేయటం కనిపిస్తుంటుంది. అంతేకాదు.. గొప్పల కోసం బాబు పడే తాపత్రయాన్ని ఎటకారం చేయటంలో జగన్ తర్వాతే ఎవరైనా.
బాబు ఎటకారాన్ని మంట పుట్టేలా ఎత్తి చూపించటమే కాదు.. ఏపీ తెలుగు తమ్ముళ్లు సైతం.. జగన్ మాటల్ని ప్రస్తావిస్తూ.. మావోడికి కావాల్సిందే అంటూ విపక్ష నేత మాటకు లోగుట్టుగా వత్తాసు పలకటం కనిపిస్తుంటుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన జగన్.. బాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాబు మాటల్లోని డొల్లతనాన్ని.. ఆయన మాటలకు.. చేతలకు మధ్యనున్న అంతరాన్ని ఎత్తి చూపించడటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
బాబుపై జగన్ సంధించిన వ్యంగ్యస్త్రాలు.. ఏపీ ముఖ్యమంత్రి చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ.. చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
+ చంద్రబాబు అహంకారం ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతున్నారు. ఈ పెద్దమనిషి ఇటీవలి కాలంలో అంటున్న మాటలు ఏమిటో తెలుసా? సముద్రాన్ని కంట్రోల్ చేశాడంట. పెథాయ్ తుపానును ఓడించాడట. సముద్రాన్ని కంట్రోల్ చేయడమేమిటి? తుపానును ఓడించడమేమిటి? ఈ పెద్దమనిషి చేయడమేమిటి? మైకుల్లో చెప్పడమేమిటి? దానిని ఆ ఎల్లో మీడియా వాళ్లు రాయడమేమిటి? టీవీల్లో చూపించడమేమిటి?
+ చంద్రబాబును నేనివాళ ఒక్కటే అడుగుతున్నా. రాష్ట్రాన్ని విడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? విభజన చట్టంలో విభజన హామీలన్నీ అమలు చేస్తామని పొందుపర్చకుండా, ప్రతి హామీని.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరి నుంచి, ఆయిల్ రిఫైనరీ -విశాఖపట్టణం రైల్వే జోన్ - ప్రత్యేక హోదా అన్నీ కూడా చూస్తాం.. పరిశీలిస్తాం.. అని చెప్పడం కాంగ్రెస్ చేసిన అన్యాయం కాదా?
+ తుపాను ఎలా వస్తుందో - ఎంత వేగంగా వస్తుందో ఐఎండీ - ఇస్రోలు రిపోర్టులు ఇస్తే వాటినే ఆర్టీజీఎస్ లో అటు ఇటుగా మార్చి ఇదేదో తానే కనిపెట్టానని చెప్పుకుంటున్న ఈ మనిషి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? సెల్ ఫోన్ - స్మార్ట్ ఫోన్ తానే కనిపెట్టానంటాడు. కంప్యూటర్లు కూడా తానే తెచ్చాడట. హైదరాబాద్ ను కట్టానంటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు తానే బ్యాడ్మింటన్ నేర్పానంటాడు. తెలుగువాడైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు కంప్యూటర్ కొట్టడం కూడా నేర్పించానంటాడు.
+ ఇటీవల ఒక పెద్దమనిషి నా దగ్గరకు వచ్చి చంద్రబాబు మనస్తత్వమెలా ఉంటుందో తెలుసా? అని అడిగితే చెప్పన్నా అన్నాను. ఒక బస్సుకు ప్రమాదం జరిగి పది మంది మరణిస్తే మనమంతా ఏమనుకుంటాం. అయ్యో పదిమంది ప్రాణాలు పోయాయే.. పాపం చనిపోయారే.. అనుకుంటాం. కానీ చంద్రబాబునాయుడు ఆ బస్సు ప్రమాదంలో 40 మంది బతకడం తన విజయమని చెప్పుకోగలుతాడు. అలాంటి వ్యక్తి అని అన్నారు.
+ చంద్రబాబు ఒకస్థాయి దాటిపోయి దేవుడి మీద విజయం సాధించానని, సృష్టి మీద విజయం సాధించానని, నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని చెబుతాడని, ఈ పెద్దమనిషిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమోనని నాతో అన్నారు.
+ ఇంతకూ పెథాయ్ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా అని ఒక పెద్దమనిషి అడిగాడు. చెప్పన్నా.. అన్నాను. తుపాను వస్తుందని ఐఎండీ - ఇస్రో వాళ్లు చెప్పారు. అందరికీ తెలిసినప్పుడు సీఎం హోదాలో ఉండి చేయాల్సింది ఏమిటి? తుపానును - ప్రజలను గాలికి వదిలేసి ప్రత్యేక విమానం ఎక్కి రాజస్థాన్ - మధ్యప్రదేశ్ సీఎంలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడికి వెళ్లారు. ఈ పెద్దమనిషికి అక్కడ పనేమిటి?
+ మోదీ ప్రధాని అవుతారు.. ఆ తర్వాత రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని రైతులకు సినిమా చూపాడు. మోదీ ప్రధాని కాగానే మన రాష్ట్రానికి పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని సినిమా చూపించాడు చంద్రబాబు. ఆ సినిమా అయిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నాలుగేళ్లు ఆయన ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినంత సేపు దాని గురించే మాట్లాడలేదు. ఆ నాలుగేళ్లు చిలుకా గోరింకలే అసూయపడేలా వీరి కాపురం సాగింది. నాలుగేళ్ల తరువాత బీజేపీకి విడాకులు ఇచ్చేసి - ఇక బీజేపీ చెడ్డది అని చంద్రబాబు ప్రచారం చేస్తూ కొత్త సినిమా మొదలెట్టాడు.
+ చంద్రబాబుకు విచారణ భయం పట్టుకుంది. ఎందుకంటే.. సంపాదించిన అవినీతి సొమ్ముతో ఏం చేయాలో అర్థం కాలేదు. తిన్నది అరగలేదు. అప్పుడు మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నాడు. ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఇచ్చి కొనేశాడు.
+ అదీ సరిపోక తెలంగాణకు వెళ్లి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కోట్ల రూపాయల డబ్బును సూట్ కేసులో పెట్టుకుని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆడియో - వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసులు బయటకు వస్తాయేమోనని - వాటిపై విచారణ జరుగుతుందేమోనని - విచారణ జరిగినప్పుడు ఆయనకు మద్దతుగా పార్లమెంటులో గొడవ చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని నిస్సిగ్గుగా మద్దతు అడిగాడు.
+ పెథాయ్ తుపాను వల్ల ఆరేడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే తన వల్లే పంట నష్టం తగ్గిందని చెబుతున్నారు. ఇంత నీచమైన వ్యక్తిని ఏమనాలి? పంట నష్టాన్ని తగ్గించి చూపిస్తూ రైతుల గొంతు కోస్తున్న ఈ పెద్ద మనిషిని ఏమనాలన్నా అని ప్రజలు అడుతుగున్నారు. తుపాను వచ్చినప్పుడు సీఎం.. రైతులు - పేదలకు తోడుగా ఉండాలి. వారికి పరిహారం డబ్బు ఇప్పించాలని ఆలోచన చేయాలి. ఆరు జిల్లాల్లో ఏర్పడిన నష్టాన్ని అధికారులు ఒక్కరోజులో లెక్క కట్టాలని హుకుం జారీ చేసిన ఇతను అసలు మనిషేనా?
+ అన్నీ ఆర్టీజీఎస్ ద్వారా తెలుస్తాయని చెబుతున్న చంద్రబాబుకు ప్రజలు పడుతున్న బాధలు - అవస్థలు అందులో కనిపించడం లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? సముద్రాన్ని కంట్రోల్ చేశానని - తుపానులను జయించానని చెబుతున్న చంద్రబాబు.. ఒకస్థాయి దాటిపోయి దేముడిని - సృష్టిని జయించానని - నవగ్రహాలనూ కంట్రోల్ చేస్తానని చెప్పినా చెబుతాడని - ఇలాంటి వ్యక్తిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ప్రజలు చెబుతున్నారు.