Begin typing your search above and press return to search.

నాయుడిగారి ఇంగ్లిష్‌ పై జ‌గ‌న్ జోకు అదిరింది

By:  Tupaki Desk   |   1 April 2017 4:19 AM GMT
నాయుడిగారి ఇంగ్లిష్‌ పై జ‌గ‌న్ జోకు అదిరింది
X
నాయుడిగారి ఇంగ్లిష్‌ పై జ‌గ‌న్ జోక్ అన‌గానే ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ వేసిన సెటైర్‌ అనుకునేరు. కాదండి. ఏపీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు క‌దా ఆయ‌న ఇంగ్లిష్ ప‌రిజ్ఞానం గురించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌!. ఈ సెటైర్‌ కు ఎంత రెస్పాన్స్ వ‌చ్చిందంటే...అసెంబ్లీలో ఉన్న దాదాపు అంద‌రూ ఎమ్మెల్యేలు న‌వ్వుకున్నారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా!

ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఏపీ అసెంబ్లీ స‌మావేశాల చివ‌రి రోజున మొగల్తూరులోని ఆక్వా ఫ్యాక్టరీలో ప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. అనంత‌రం జ‌గ‌న్ వంతు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ``అధ్యక్షా... మంత్రిగారిని కాస్త ఇంగ్లిష్ నేర్చుకోమ‌నండి. ఆక్వా ప్లాంట్ విష‌యంలో చెప్పాల్సింది కామన్ ఎఫెక్ట్ ట్రీట్ మెంట్ ప్లాంటు కాదు... కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంటు. అది నేర్చుకోమనండి సార్` అని అన్నారు. దీంతో స‌భ ఒక్క‌సారిగా గొళ్లుమంది. ఎమ్మెల్యేలంతా న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. ఈ ప‌రిస్థితితో ఇబ్బంది ప‌డ్డ అచ్చెన్నాయుడు త‌న ఆవేశాన్ని ఆపుకొంటూ చ‌ర్చ‌లోకి వ‌చ్చారు.

జ‌గ‌న్‌ కు, త‌న‌కు తేడా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. `నీలాగా డ‌బ్బులుండి నేను హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ లో చ‌దువుకోలేదు. శ్రీ‌కాకుళం జిల్లాలో మ‌ట్టిమీద కూర్చొని చ‌దువుకున్నాను. నీలాగా నాకు ఇంగ్లిష్ - హిందీ వ‌చ్చి ఉంటే....స‌భ‌లో ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండ‌లేన‌ట్లుగా మాట్లాడుదును` అని అన్నారు. అయితే ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ సంయ‌మ‌నం పాటించి చ‌ర్చ‌ను అక్క‌డితో ఆపేశారు. దీంతో ఈ విష‌యం పొడ‌గింప‌బ‌డ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/