Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడిపై జగన్ సైటెర్లు

By:  Tupaki Desk   |   30 Nov 2020 12:30 PM GMT
అచ్చెన్నాయుడిపై జగన్ సైటెర్లు
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బీఏసీ సమావేశం నిర్వహించి ఐదురోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. టీడీపీ కోరినట్లే వ్యవసాయంపై చర్చిద్దామని సీఎం అన్నారు. టెలిపతి వల్ల టీడీపీ అనుకున్నది ముందే తెలిసిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ దాడులపై చర్చించాలని అచ్చెన్న ప్రస్తావించగా.. తమ ఎంపీ సురేష్ పై టీడీపీ దాడి చేసింది దానికోసమేనా? దళిత మహిళపై మీరు దాడి చేసింది మర్చిపోయారా? అంటూ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు.

ఇక బీఏసీ సమావేశంలో అరగంట ఆలస్యంగా సభ ప్రారంభించడమేంటన్న అచ్చెన్నాయుడు ప్రస్తావించగా.. మీరు ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారని లేటవుతుందని ఆలస్యంగా ప్రారంభించామని మంత్రులు సెటైర్లు పేల్చారు. చివర్లో సీఎం జగన్ అచ్చెన్నాయుడిని చూసి ‘ద గ్రేట్ అచ్చెన్నాయుడు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక బీఏసీలో అచ్చెన్నాయుడు - మంత్రుల వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ 10 రోజులు జరపాలని అచ్చెన్నాయుడు కోరగా.. కరోనా పెరుగుతోంది, సభలో 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఉన్నారని.. అందుకే సమావేశాన్ని ఐదు రోజులకు కుదించామని మంత్రులు అన్నారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తురాలేదా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా కారణంగా అధికారులు భయపడుతున్నారని సీఎం అన్నారు.