Begin typing your search above and press return to search.
ఏపీ-తెలంగాణ మధ్య జలజగడం ..కేఆర్‌ఎంబీకి జగన్ సర్కార్ మరో లేఖ!
By: Tupaki Desk | 30 Jun 2021 8:30 AM GMTతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నిన్నటి వరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం , తాజాగా ఇప్పుడు పవర్ పంచాయితీగా మారింది. అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది.
జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ ఎం బీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్ సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6.9 టీఎంసీల నీటిని వాడేశారని పేర్కొన్నారు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి. ఎగువ నుంచి వచ్చిన 17.36 టీఎంసీల నీటిలో 40 శాతం నీటిని తెలంగాణ వాడేసిందని లేఖలో ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.