Begin typing your search above and press return to search.

కడప స్టీల్ పై సర్కార్ యూటర్న్

By:  Tupaki Desk   |   1 April 2021 5:16 AM GMT
కడప స్టీల్ పై సర్కార్ యూటర్న్
X
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన కడప స్టీల్ ప్లాంట్ కు గ్రహణం పట్టింది. ఆదిలోనే ఈ ప్లాంట్ కు కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్కువ పెట్టుబడి ఉన్న కారణంగా బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్ దివాళా తీయడంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లిబర్టీ స్టీల్స్ పై యూటర్న్ కు ప్రభుత్వం సిద్ధపడింది.

కరోనా లాక్ డౌన్ తో దివాళా తీసిన లిబర్టీ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ ను చేపట్టే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఆ కంపెనీతో కాంట్రాక్టును రద్దు చేసుకోవాలనుకుంటోంది. ఆరునెలలు గడిచినా లిబర్టీ స్టీల్స్ ను ఆర్థిక ఇబ్బందులు తొలగకపోవడంతో దివాళా తీసింది. దీంతో కడప స్టీల్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

బ్రిటన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించి ఈ మేరకు లిబర్టీ స్టీల్ పై నివేదిక కోరింది. వారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ప్రతికూలంగా ఉండడంతో ఇక లిబర్టీ సంస్థతో జగన్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. మంత్రి మేకపాటి ఆ సంస్థతో ఒప్పందాన్ని వదిలించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఈ క్రమంలోనే కడప స్టీల్ ఏర్పాటు కోసం కొత్త భాగస్వాములను వెతికే పనిలో ఏపీ సర్కార్ పడింది. ఇందుకోసం దేశీయ ఎస్సార్ స్టీల్ తోపాటు మరికొందరితో సంప్రదింపులు జరుపుతోంది. ఆయితే ఏపీ సర్కార్ తక్కువ పెట్టుబడితో ముందుకు రావడంతో ఏ సంస్థలు ముందురావడం లేదని తెలుస్తోంది.