Begin typing your search above and press return to search.

53 మంది మహిళా ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్!

By:  Tupaki Desk   |   27 Nov 2020 7:50 AM GMT
53 మంది  మహిళా ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్!
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి మహిళా జైలు నుండి 19 మంది, కడప 27, నెల్లూరు 5, విశాఖపట్నం నుంచి ఇద్దరు విడుదలకానున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 53 మంది మహిళా ఖైదీలకు జీవితఖైదు నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ వీరి విడుదలకు సిఫార్సు చేసింది.

అయితే , ముందస్తుగా విడుదలైయ్యే వారికీ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. రూ. 50 వేల రూపాయల పూచీకత్తు బాండ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. శిక్ష కాల పరిమితి ముగిసేవరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్ ‌కి హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన ఖైదీలు బయటకు వెళ్లిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడ కూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ఒకవేళ అలా జరిగితే వారిని వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు జైలుశిక్ష పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా జీవిత ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఖైదీల విడుదలకు సంబంధించి కసరత్తుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.