Begin typing your search above and press return to search.

ఇసుకపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   27 July 2020 4:45 AM GMT
ఇసుకపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
X
ఏపీలో ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీంతో మట్టితో కలిసి నాణ్యత లేని ఇసుక వస్తోందని చాలా ఫిర్యాదులు వచ్చాయి. స్వయంగా మంత్రి పినిపే విశ్వరూప్ కు సైతం గత నెలలో తూర్పు గోదావరి జిల్లాలో ఇంటి నిర్మాణానికి నాసిరకం ఇసుక సరఫరా చేశారు. ఆయనా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. రాష్ట్రంలో ఇంటికి డెలివరీ చేసిన ఇసుక కూడా నాణ్యతగా ఉండడం లేదని జిల్లాల్లో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయట.. దీంతో ఈ ఇసుక ఉపయోగపడడం లేదు. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది.

ఇసుక విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత నాణ్యమైనది సరఫరా కాకపోతే దాన్ని వెనక్కిపంపే అవకాశాన్ని కొనుగోలు దారులకు ఇవ్వనున్నారు. మళ్లీ నాణ్యమైన ఇసుక ఉచితంగా అందేలా చూడనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇక తవ్విన ఇసుకకు.. స్టాక్ పాయింట్లలో నిల్వ ఉన్న ఇసుకకు లెక్కల్లో తేడా వస్తోంది. ఇసుక కొందరు అక్రమంగా అమ్ముకున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆడిట్ చేసిన ప్రభుత్వం తాజాగా డ్రోన్ల ద్వారా సర్వే చేయించాలని డిసైడ్ అయ్యింది. ఆడిట్ నివేదిక వివరాలను, డ్రోన్ లెక్కలను పరిశీలించనున్నారు.ఇలా ఇసుకపై కఠిన చర్యల దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది.