Begin typing your search above and press return to search.
పులస చేప కోసం కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ !
By: Tupaki Desk | 9 Feb 2021 12:10 PM GMT'పుస్తెలమ్మయినా పులస తినాలి' .. ఈ నానుడి గోదావరి జిల్లాలో బాగా ఫెమస్. అయితే, ఆ పులస చేపకి ఉండే ప్రత్యేకత అలాంటిది మరి. జీవితంలో ఒక్కసారైనా కూడా పులస చేప టెస్ట్ చేయాలి అని అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే, ఈ పులస చేప కేవలం సంవత్సరం లో జులై, ఆగస్టు నెలల్లో మాత్రమే లభిస్తాయి. ఈ చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
పులస చేప మార్కెట్ లోకి వచ్చాయంటే నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. గోదావరి నదిలో ఉండే ఈ పులస చేపల స్వేచ్ఛా విహారం కోసం పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పులస చేపలు ఎగువకు, దిగువకు రాకపోకల కోసం స్పిల్ వే రెండో పియర్‌లో ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతోంది.
జూన్ నాలుగో వారం నుంచి జూలై, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి. గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. గోదావరికి వరద సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడంతో నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారుతుంది.
పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఈ పులస చేపల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
ఇలస రాక, పులస పోకకు ఆటంకం లేకుండా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం చేసే బాధ్యతను కొల్ కతా లోని ప్రఖ్యాత సీఐఎఫ్ ఆర్ ఐ కు ప్రభుత్వం అప్పగించింది. సీఐఎఫ్ ఆర్ ఐ ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసి కేంద్ర జల సంఘానికిం పంపించగా ఆమోదించడంతో ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్ వే రెండో పియర్ కు అమర్చుతోంది.
గోదావరి నదిలో వరద ప్రవాహం ఎలా ఉన్నా పులసలు స్వేచ్ఛగా తిరిగేలా మూడు చోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. గోదావరిలో నీటి మట్టం ఎలా ఉన్నా సరే ఈ చేప ఎగువకు, దిగువకు రాకపోకలు కొనసాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.