Begin typing your search above and press return to search.

సీఎం కాలేదు.. సమీక్ష‌లు చేసేయ‌ట‌మా?

By:  Tupaki Desk   |   24 May 2019 8:33 AM GMT
సీఎం కాలేదు.. సమీక్ష‌లు చేసేయ‌ట‌మా?
X
గుడ్డు మీద ఈక‌లు పీక‌టం లాంటిదే ఈ ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల్లో చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారికంగా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేదు. అయితే.. జ‌గ‌న్ ను క‌లిసేందుకు..ఆయ‌న‌తో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున అధికారులు త‌ర‌లివ‌స్తున్నారు. సాంకేతికంగా చూస్తే.. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో గెలిచారేకానీ అధికారికంగా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేదు.

కానీ.. అధికారుల‌తో క‌లిసి రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల మీద ఆరా తీయ‌ట‌మే కాదు.. వివిధ శాఖ‌ల మీద స‌మీక్ష‌లు కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేయ‌ట‌మేకాదు.. ఇలా చేయ‌టం స‌రికాద‌ని.. వివాదాస్ప‌దం అవుతుంద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. వారి వాద‌న ఏమంటే.. ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి చంద్ర‌బాబు రాజీనామా చేశార‌ని.. కొత్త ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం చేసే స‌మ‌యం వ‌ర‌కూ అప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు.

ఈ నేప‌థ్యంలో ప‌లువురు పోలీసు.. ఉన్న‌తాధికారులు జ‌గ‌న్ ను క‌లిసేందుకు క్యూ క‌ట్ట‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. అయితే.. దీన్లో ప‌స లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. సాంకేతికంగా చూస్తే.. జ‌గ‌న్ సీఎం ప‌ద‌విని అధికారికంగా చేప‌ట్ట‌కున్నా.. ఆయ‌న ముఖ్య‌మంత్రి అన్న విష‌యం తెలిసిందే. అలాంట‌ప్పుడు శాఖ‌ల ప‌రంగా వివ‌రాలు సేక‌రించ‌టంలో త‌ప్పేముంది? అన్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతుంది.

ముహుర్తాలు.. న‌మ్మ‌కాలు వ‌గైరాల నేప‌థ్యంలో ప్ర‌మాణ‌స్వీకారానికి కాస్త ఆల‌స్య‌మ‌వుతుంద‌ని.. అంత మాత్రాన ఎవ‌రితోనూ భేటీ కాకూడ‌ద‌న్న వాద‌న స‌రికాదంటున్నారు. ఎక్క‌డైనా.. ఎప్పుడైనా అధికార బ‌దిలీ జ‌ర‌గుతున్న‌ప్పుడు విజ‌యం సాధించిన అధినేత వ‌ద్ద‌కు అధికారులు క్యూ క‌ట్ట‌టం.. త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకోవ‌టం లాంటివి చేస్తుంటారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అవుతారు. ఇలాంటి సంద‌ర్భాల్లో కాసింత మాట్లాడ‌టం త‌ప్పు ఎలా అవుతుంద‌న్న ప్ర‌శ్న ఎదుర‌వుతుంది.

శాఖ‌ల ప‌రంగా స‌మీక్ష‌లు చేస్తున్నార‌న‌టం త‌ప్పు కానీ.. వివిధ శాఖ‌ల వివ‌రాల్ని ఆయా శాఖాధిప‌తులు క‌లిసిన‌ప్పుడు అడిగి తెలుసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఇది త‌ప్పుగా చెప్ప‌టంలో అర్థం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికే సీఎంకు కేటాయించే భ‌ద్ర‌తతో పాటు.. కొత్త కాన్వాయ్ ను కేటాయించేశారు.

ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్ కు తితిదే ఆర్చ‌కులు ఉండ‌వ‌ల్లికి వ‌చ్చిజ‌గ‌న్ కు స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. అధికారికంగా జ‌గ‌న్ సీఎం కాన‌ప్ప‌టికీ.. అన‌ధికారికంగా సీఎం అయిన‌ట్లేన‌ని చెప్ప‌క‌తప్ప‌దు. అధికార బ‌దిలీ అన్న‌ది సాంకేతికం త‌ప్పించి మరింకేమీ లేన‌ప్పుడు.. అన‌వ‌స‌ర‌మైన చ‌ర్చ స‌రికాద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.