Begin typing your search above and press return to search.
వేడుక కోసం దుబారా ఖర్చు అస్సలు వద్దు
By: Tupaki Desk | 30 May 2019 4:42 AM GMTమరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రమాణస్వీకారోత్సవ మహోత్సవానికి సంబంధించి అధికారులు చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న జగన్.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక ప్రశ్న అధికారుల్ని ఆశ్చర్యపోయేలా చేసిందట.
ప్రమాణస్వీకారోత్సవానికి ఎంత ఖర్చు అవుతుందని జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోవటం అధికారుల వంతైంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టింది లేదంటున్నారు. చేపట్టే కార్యక్రమం అదిరిపోయేలా చేయాలని.. ఖర్చు వెనుకాడొద్దని చెప్పటం మాత్రమే చూసే వాళ్లమని.. అందుకు భిన్నంగా వృధా ఖర్చు అస్సలు వద్దని.. ప్రమాణస్వీకారోత్సవం లగ్జరీగా ఉండకూడదన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేని పరిస్థితుల్లో ఖర్చు విషయంలో వృధా అన్నది పనికి రాదని.. ఎంత సింఫుల్ గా అయితే.. అంత సింఫుల్ గా కార్యక్రమం నిర్వహించాలని.. అదే సమయంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
ప్రమాణస్వీకారోత్సవ ఖర్చు గురించి జగన్ ఆరా తీసిన వైనాన్ని అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత చిన్న విషయంలోనూ జగన్ దృష్టి పెడుతున్నారంటే.. రానున్న రోజుల్లో పాలన మీద పట్టు చూపించటమేకాదు.. అనవసరమైన ఖర్చులకు చరమగీతం పాడటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.