Begin typing your search above and press return to search.

ఆ భాద్యత అధికారులదే ...ప్రతి ఒక్కరికీ ఇళ్ళ పట్టా ఇవ్వండి :సీఎం జగన్

By:  Tupaki Desk   |   23 Jun 2020 11:30 PM GMT
ఆ భాద్యత అధికారులదే ...ప్రతి ఒక్కరికీ ఇళ్ళ పట్టా ఇవ్వండి  :సీఎం జగన్
X
ఒకవైపు రాష్ట్రంలో మహమ్మారి వైరస్ విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంటే మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి వైరస్ తగు నివారణ చర్యలు తీసుకుంటూనే , పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

జూలై 8న దివంగత సీఎం వైఎస్ ఆర్ జయంతి రోజున పేదలకు ఇళ్ల పట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిపై సీఎం జగన్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా తెలిపారు. భూసేకరణ, పొజిటిషన్, ప్లాట్ల అభివృద్ధి పై అధికారులు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.

80 శాతం 85 శాతం 90 శాతం అంటూ అధికారులు లెక్కలు చెబితే తాను అంగీకరించని నూటికి నూరు శాతం పట్టాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ సూచించారు. కోవిడ్ పరిస్థితులు తగ్గాక తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానన్న జగన్ సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇళ్ల పట్టాలు నిరాకరిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాల్సిందే అని అన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వచేశామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.