Begin typing your search above and press return to search.

చిన్నారి లేఖపై జగన్ స్పందన.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   15 Sep 2019 5:21 AM GMT
చిన్నారి లేఖపై జగన్ స్పందన.. తర్వాతేమైందంటే?
X
తమ కుటుంబాన్ని వెలి వేశారని.. తనతో స్కూల్లో ఎవరూ మాట్లాడటం లేదని.. తన తాత.. తండ్రి ప్రాణాలకు హాని ఉందంటూ చిన్నారి పుష్ప రాసిన లేఖ సంచలనంగా మారటం తెలిసిందే. ఈ లేఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మీడియాలో సంచలనంగా మారిన ఈ లేఖపై రియాక్ట్ అయిన సీఎం జగన్.. స్వయంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి.. ఈ ఉదంతం గురించి వివరాలు సేకరించి.. ఇష్యూ ను క్లోజ్ చేయాలన్నారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ హన్ మోహన్ స్వయంగా బాలిక గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. మత్య్సకార సొసైటి నుంచి గ్రామానికి వచ్చిన బోటును.. వలలను బాలిక తాత వాడుకున్నారని స్థానికులు వెల్లడించారు. అంతేకాదు.. గ్రామంలో పలువురికి డబ్బులు ఇవ్వాలని తెలిపారు. వివాదానికి కారణమైన అంశాల్ని చర్చించేందుకు పిలిస్తే రాలేదని.. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రికి చిన్నారి లేఖ రాయటం నిజం కాదని.. ఆ లేఖ వెనున నాగార్జున రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లుగా అధికారులకు తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ఆదేశంతో గ్రామానికి వచ్చిన అధికారి తమను కలవలేదని బాలిక తాత వెంకటేశ్వర్లు వెల్లడించారు.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి.. ఆయన అనుచరులు తమను ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ఈ విషయం మీద మరింత లోతుగా విచారిస్తే కానీ అసలు విషయం తేలదని చెబుతున్నారు. మరేం అవుతుందో చూడాలి.