Begin typing your search above and press return to search.

కేసీఆర్ సలహాను తిరస్కరించిన జగన్?

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:30 PM GMT
కేసీఆర్ సలహాను తిరస్కరించిన జగన్?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్టు తెలుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ, కేంద్రమంత్రులతో సమావేశమవుతూ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. గతంలో కేసీఆర్ చెప్పినట్టు నడుచుకున్నట్టు ఉన్న జగన్ ఇప్పుడు కేసీఆర్ మాటలను లెక్క చేయడం లేదని తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆర్ స్పష్టమైన వైఖరి తీసుకున్న జగన్ కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో దోస్తీ చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఓ రూటు, జగన్ మరో రూటు వెళ్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్, జగన్ మూడో కూటమిలో చేరాలని భావించారు. కానీ పరిస్థితులు మారడంతో ప్రస్తుతం ఎలాంటి వైఖరి లేకుండా ఉన్నారు.

అయితే కేసీఆర్ తో జగన్ ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన జగన్ కు కొన్ని పరిపాలనపరమైన సలాహాలు, సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా ఆర్టీసీ విషయంలో కూడా సలహా ఇచ్చారంట. అయితే దాన్ని జగన్ పట్టించుకోలేదని ఏకంగా ఏపీ మంత్రి ప్రకటించారు. అది ఏ విషయంలోనంటే.. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం విషయం లో కేసీఆర్ చెప్పిన సలహాను పాటించ లేదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఎందుకంటే.. ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనాన్ని చాలామంది వ్యతిరేకించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సలహా ఇచ్చారంట. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తే రాష్ట్రానికి ఆర్థిక భారమని చెప్పగా జగన్ వినకుండా మొండి పట్టుతో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేశారని తెలిపారు. అది కేవలం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం విజయవంతం గా ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేశారని తెలిపారు. ఈ విధంగా కేసీఆర్ సలహాను జగన్ తిరస్కరించారు. ఇక ఇప్పుడు రాజకీయ పరంగా కూడా జగన్ కేసీఆర్ సలహాలు పట్టించుకునే స్థితిలో లేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీతో జగన్ దోస్తీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి