Begin typing your search above and press return to search.
ఆ నలుగురు ఎమ్మెల్యేలకూ నో చెప్పిన జగన్!
By: Tupaki Desk | 7 Feb 2017 4:30 AM GMTతెలుగుదేశంలో పరిణామాలు ఆ పార్టీ పంచన చేరిన వారికి ఆందోళన రేపుతున్నాయి. పార్టీ భవితవ్యం రోజు రోజుకూ ఆందోళన కరంగా మారుతోంది. కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. ఎన్నికలు దగ్గరబడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలకు రాజకీయ భవితవ్యం మీద బెంగ మొదలైంది. ప్రత్యేకించి ఫిరాయింపులకు పాల్పడ్డ కొంతమంది నేతలకైతే మరింత టెన్షన్ పెరుగుతోంది!
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగడం మృగ్యమైంది. చంద్రబాబు పనిగట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా - అసెంబ్లీ సీట్లను పెంచాలని ప్రదక్షిణలు చేస్తున్నా.. కేంద్రం నుంచి ఏ మాత్రం సానుకూల స్పందన కనిపించడం లేదు. సీట్ల పెంపు 2029కే అని కేంద్రం పార్లమెంటు సాక్షిగా పలు సార్లు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో.. ఫిరాయింపుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో వరసగా ఎదురవుతున్న అవమానాలు వాళ్లకు కళ్లల్లో నీళ్లు పెట్టుకునేలా చేస్తున్నాయి! పచ్చ కండువా వేసే ముందు పండగ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వీళ్లను పట్టించుకోవడమే మానేశాడు. మంత్రి పదవులు లేవు, అనుచరులకు అనుకూలతలు లేవు.. దీంతో పచ్చపార్టీ కండువాలు వేసుకున్న వైకాపా ఎమ్మెల్యేల్లో మధనం మొదలైంది. చంద్రబాబు - లోకేష్ బాబుల చేత ఛీత్కారాలు తింటున్న వీళ్లకు భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఇప్పుడు మంత్రి పదవుల సంగతి అటుంచితే.. అసలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయగలమా? అనేది కూడా వీళ్లకు అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలో వీరిలో వైకాపాలో తాము రాజాల్లాగా గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి. వైకాపాలో ఉంటే.. అధికారం చేతిలో లేకపోయినా, ఆత్మగౌరవం అయినా ఉండేది! అయితే ఇప్పుడు రోజూ అవమానాలే. తమకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబును, లోకేష్ ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వాళ్లు వీళ్లను పట్టించుకోవడం కూడా లేదు! దీంతో ఫిరాయింపుదారుల్లో కసి పెరిగి.. తిరిగి వెళ్లిపోవాలనే భావనకు వచ్చారు. ఇలాంటి వారు నలుగురు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని సంప్రదించినట్టుగా కూడా తెలుస్తోంది!
తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందు వల్లన పార్టీ మారామని, గత్యంతరం లేకే ఆ పని చేశామని, చంద్రబాబు మాట నమ్మి మోసపోయామని.. ఇప్పుడు తాము రియలైజ్ అయ్యామని, తిరిగి వైఎస్సార్ లోకి వస్తామని వీరు జగన్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని వీరు నివేదిస్తున్నట్టు సమాచారం.
అయితే.. వీరి పట్ల వైకాపా అధినేతకు ఏ మాత్రం సానుకూల దృక్పథం లేనట్టుగా తెలుస్తోంది. వీరు ప్రాధేయపడుతున్నప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోనట్టు సమాచారం. ఒక మనిషిని ఒకసారి నమ్మగలం కానీ, ప్రతి సారీ నమ్మి మోసపోలేమని జగన్ స్పష్టం చేస్తున్నాడని తెలుస్తోంది. వాళ్ల అవసరం లేదని, ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకున్నామని.. మోసం చేసి వెళ్లిన వారిపై ఇప్పుడు జాలి చూపే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోని ఆ నలుగురు మాత్రం జగన్ ను ప్రాధేయపడే పనిలో తమ దూతలను పంపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి తీసుకునేది లేదని.. జగన్ ఖరాఖండిగా చెబుతున్నాడు.
అయినప్పటికీ జగన్ మీద ఆశలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారిద్దరు, కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు.
Source : Vankaya.Com