Begin typing your search above and press return to search.

'జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర' చేయండి : లోకేష్ స‌ల‌హా

By:  Tupaki Desk   |   30 May 2022 4:30 AM GMT
జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర చేయండి :  లోకేష్ స‌ల‌హా
X
వైసీపీ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జలరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి ఉంటే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను గేటు బయటే ఉంచారని ఆవేదన వ్యక్తంచేశారు. అటెంబ‌రు నుంచి ఐఏఎస్ దాకా రెడ్ల‌కు సామాజిక న్యాయం జ‌రిగింద‌న్నారు. "రెడ్డి.. రెడ్డి.. రెడ్డి.. ఎటు చూసినా.. సామాజిక న్యాయం ఇదేనా!" అని ప్ర‌శ్నించారు.

వైసీపీ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ అని లోకేశ్ నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు గేటు బయట అని ఆవేదన వ్యక్తం చేశారు.

అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం వారికి.. రెండు వేల కీలక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకు ఇచ్చారని దుయ్యబట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ సర్కారు చేయాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదని.. 'జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర' అని ధ్వజమెత్తారు. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు.. ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని ఆక్షేపించారు. ఎటు చూసినా రెడ్లే క‌నిపిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

స‌ర్కారులో వ‌ణుకు స్టార్ట‌యింది!మహానాడు విజయవంతం కావడంతో ప్రభుత్వంలో వణుకు మొదలయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రులు బస్సు యాత్ర పేరుతో రోడ్లపై తిరుగుతూ పరిపాలనను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.

మంత్రులు యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. సీఎం దావోస్ పర్యటన కుటుంబ పర్యటనగా మారిందని విమర్శించారు. పెట్టుబడులు తీసుకురాకుండా విహారయాత్ర చేసి వచ్చారన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పై సీఎం ఇంత వరకు ఎందుకు స్పందించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు.