Begin typing your search above and press return to search.
ఏపీ హోదాపై జగన్ వాదన ఇదే!
By: Tupaki Desk | 15 Jun 2019 6:13 AM GMTవిషయం ఏదైనా సరే ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఎంత ప్రతికూలత ఉన్నా.. ఆ అంశం నుంచి పక్కకు జరగటం ఉండదన్న తీరును ప్రదర్శిస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎంతలా ఆరాటం చెందారో.. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలోనూ అదే తీరును ప్రదర్శించటం కనిపిస్తుంటుంది. జగన్ ప్రస్తావించే ముఖ్యమైన అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఒకటి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రధాని మోడీ సానుకూలంగా లేనప్పటికీ.. ఆ విషయంలో ఆయన మనసు కరిగేలా చేయాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు కమ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలోనూ తానను నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పటమే కాదు.. మోడీ మనసు మారేలా ప్రయత్నించాలని అమిత్ షాను కోరారు.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటున్న జగన్ మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాను.. దాని అవసరం రాష్ట్రానికి ఎంత ఉందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక వాదనను సిద్ధం చేసుకున్నారు. ఏపీకి హోదా ఇవ్వటం ద్వారా పొందే ప్రయోజనాల్ని ఏకరవు పెట్టటంతో పాటు..విభజన కారణంగా ఏపీ ఎంతలా ఆదాయాన్ని నష్టపోయిందన్న విషయాన్ని గణాంకాల రూపంలో వివరించనున్నారు.
హోదా మీద జగన్ వాదన ఎలా ఉండనుందంటే..
+ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరం. విభజన తరువాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ప్రగతి పరుగులో వెనుకంజలో ఉంది. తలసరి ఆదాయంలోనూ బాగా వెనుకబడింది.
+ 2015–16లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,397 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411. అక్షరాస్యత.. మాతా శిశు మరణాలను నియంత్రించడంలోనూ ఏపీ వెనుకబాటులో ఉంది. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పంటల బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్న సొమ్ము పరిహారంగా ఇస్తున్న సొమ్ము కంటే ఎక్కువగా ఉంటోంది.
+ దీన్ని సరిచేయడానికి కేంద్రం చెల్లించే ప్రీమియం వాటాను రాష్ట్రానికి గ్రాంట్‌గా ఇచ్చేస్తే రాష్ట్ర సర్కారు రైతులకు న్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తరువాత ఆ పంటల ప్రొక్యూర్‌మెంట్‌లో ఆంక్షలు విధించరాదు.
+ మొత్తం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రైతుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసే సొమ్మును పాత బకాయిల కింద బ్యాంకులు సర్దుబాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం ఇవ్వాలి.
+ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ సగటు వాటాతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలి.