Begin typing your search above and press return to search.
జగన్ రాజీనామా?
By: Tupaki Desk | 24 Oct 2015 7:25 AM GMTప్రత్యేక హోదా సాధన డిమాండుతో ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టి తాను పరుగులు పెట్టాలనుకుంటున్న ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఆయన రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు అందరితో రాజీనామా చేయాలని జగన్ అనుకుంటున్నారట. కానీ, ఆయన నిర్ణయానికి ఎంతమంది ఎమ్మెల్యేలు - ఎంపీలు ఓకే అంటారన్నది సందేహమే. ఎందుకంటే.. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్న భయం వారందరిలోనూ ఉంది.
ఎలాగైనా చంద్రబాబు అయిదేళ్ల టెర్మ్ పూర్తి కాకుండానే ఆయన్ను దించేసి తాను సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది వైసీపీ అధినేత జగన్ కోరిక. అయితే.. అది కోరికగానే ఉంటోంది తప్ప, నెరవేరే అవకాశమే కనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ప్రజల ముందు పెట్టి తాను మైలేజి సంపాదించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు. ఇప్పటికే రుణమాఫీ - భూసమీకరణ - ఫీజులు వంటి అంశాలపై గొంతెత్తి ఏమీ సాధించలేకపోయిన జగన్ ఇటీవల ప్రత్యేక హోదా దీక్షపేరుతో కడుపు మాడ్చుకున్నా ప్రజలు అయ్యో అనలేదు. మరోవైపు చంద్రబాబు తలపెట్టిన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం మాత్రం సూపర్ సక్సెస్ అయింది.. అంతేకాదు, ఆ కార్యక్రమానికి నిన్నమొన్నటి వరకు చంద్రబాబుకు విరోధిగా ఉన్న తన మిత్రుడు కేసీఆర్ హాజరవడం... కేసీఆర్ - చంద్రబాబులిద్దరూ భుజంభుజం రాసుకుని తిరగడంతో జగన్ కు మరింత మండుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి మరింత పదునైన పొలిటికల్ స్టెప్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే... ఇంతకుముందులు తోచింది తోచినట్లుగా చేసి దెబ్బయిపోకుండా ఉండేందుకు ఈసారి ఇందులో మంచి చెడులు, లాభనష్టాలు అన్నీ ఆలోచిస్తున్నారు. రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే ఎలా ఉంటుందన్న తన ఆలోచనను ఇప్పటికే పార్టీ ముఖ్యులతో ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, ఎవరూ దీనికి సుముఖంగా కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, జగన్ నిర్ణయిస్తే మాత్రం పాటించక తప్పదని పేర్కొంటున్నాయి.
ఇప్పటికే పొలిటికల్ గా చాలావిషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాగా వెళ్తున్నజగన్.. రాజీనామాల విషయంలోనూ ఆ పాలసీనే ఎంచుకోవాలనుకుంటున్నట్లుగా అర్ధమవుతోంది. తెలంగాణలో టీఆరెస్ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ జోరు తగ్గినప్పుడంతా రాజీనామాలు చేసి సెంటిమెంటు రగిల్చి మళ్లీ గెలిచేవారు. ఇప్పుడు జగన్ అలాగే చేయాలనుకుంటున్నారు. కానీ, అప్పటి పరిస్థితులు, ఆ సెంటిమెంట్లు ఏపీలో వర్కవుట్ అవుతాయా అన్నది జగన్ ఆలోచించాలి. ఆలోచించకుండా రాజీనామా చేస్తే ఉన్నదీ ఉంచుకున్నది రెండూ పోయే ప్రమాదముంది.