Begin typing your search above and press return to search.
23 సబ్జెక్ట్స్ కు జగన్ సిద్ధం.. అవేమంటే?
By: Tupaki Desk | 11 July 2019 4:52 AM GMTఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అన్నంతనే అధికారపక్షం ఆత్మరక్షణలో పడితే.. ఉరకలెత్తే ఉత్సాహంతో విపక్షం విరుచుకుపడేందుకు సిద్ధమవుతుంటుంది. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో నెలకొంది. అసెంబ్ల సమావేశాలు ప్రారంభం అవుతుంటే.. విపక్షం ఏ సబ్జెక్ట్ ను తెర మీదకు తీసుకొస్తుందన్నది అర్థం కాక అధికారపక్షం ఇబ్బందిపడుతుంటుంది. దీనికి భిన్నంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఈ రోజు (గురువారం) నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా జగన్ సర్కారు 23 అంశాల్ని సిద్ధం చేసింది. సభలో చర్చించేందుకు వీలుగా 23 అంశాల జాబితాను రెఢీ చేసిన జగన్... వాటిని చర్చించేందుకు తాము రెఢీ అన్నారు. ఈ అంశాలే కాదు.. మరే అంశమైనా సరే విపక్షం నోటీసులు ఇస్తే ఒక రోజు గడువుతో వాటిపై చర్చ జరుపుతామని.. అందుకు ఎంత సమయమైనా ఫర్లేదన్న మాట జగన్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా ఏదైనా అంశంపై చర్చ అంటే.. వీలైనంత తక్కువ వ్యవధిలో ముగించాలన్న ఆత్రుత అధికారపక్షంలో ఉంటుంది. అందుకు భిన్నంగా ఎంతసేపు అయినా సరే.. చర్చకు తాము సిద్ధమన్న మాట జగన్ చెప్పటంతో నోట మాట రాని పరిస్థితుల్లో విపక్షం ఉండిపోయింది. ఎప్పటిలానే తాము వివిధ అంశాల మీద చర్చకు అడిగితే.. అధికారపక్షం నో అంటుందేమోనన్న పాతకాలపు ఐడియా జగన్ ముందు పారలేదు. ఊహకు అందని రీతిలో జగనే 23 సబ్జెక్ట్స్ ను సిద్ధం చేసి.. వీటి మీద చర్చిద్దామా? ఇవి కాకుండా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? అని అడగటంతో నోట మాట రాని పరిస్థితుల్లో టీడీపీ ఉండిపోయింది.
జగన్ సిద్ధమైన 23 సబ్జెక్ట్స్ చూస్తే..
+ వ్యవసాయ రంగం- రైతు భరోసా-40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు..
+ రాష్ట్రంలో విద్యారంగం - పాఠశాలలు
+ కాలేజీల పరిస్థితి
+ అమ్మఒడి
+ అధిక ఫీజుల నియంత్రణ
+ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు
+ పారదర్శకమైన పాలన
+ అవినీతి నిర్మూలన
+ ప్రభుత్వ నామినేటెడ్ పదవులు
+ పనుల్లోనూ బడుగు బలహీన వర్గాలు
+ మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు
+ నీటిపారుదల రంగం- పోలవరం
+ ఇతర ప్రాజెక్టులు
+ గృహ నిర్మాణం- 25 లక్షల ఇళ్లస్థలాలు
+ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు
+ గత ఐదేళ్ల అప్పులు - బకాయిలు
+ ప్రత్యేక హోదా
+ విభజన హామీలు
+ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రాని నిధులు
+ విద్యుత్ రంగం-వాస్తవాలు
+ రాజధాని అంశం - సీఆర్ డీఏ పరిధిలో భూ కేటాయింపులు
+ పొదుపు సంఘాల రుణాలు - వాస్తవాలు
+ బెల్టు షాపులు - ఎక్సైజ్ పాలసీ
+ గ్రీవెన్సె - స్పందన కార్యక్రమం
+ ఇసుక అక్రమ రవాణా
+ గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూ కేటాయింపులు
+ అగ్రిగోల్డ్ అంశం
+ జన్మభూమి కమిటీలు - రాజ్యాంగేతర శక్తులు
+ అవినీతి
+ కే టాక్స్
+ నదుల ఆక్రమణలు
+ అక్రమ కట్టడాలు - భవిష్యత్ పై ప్రభావం
+ కాంట్రాక్టులు - అవకతవకలు - అవినీతి
+ ఉద్యోగాలు - నిరుద్యోగం
+ గ్రామ సచివాలయం
+ గ్రామ వాలంటీర్లు
+ ప్రభుత్వ ఉద్యోగులు - సంక్షేమం