Begin typing your search above and press return to search.
మహాభారతంతో కుస్తీ పడుతున్న జగన్
By: Tupaki Desk | 31 Aug 2016 8:07 AM GMTరాజకీయంగా పరిణతి సాధించే క్రమంలో ఇప్పుడిపుడే అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ క్రమంలో కొత్త ప్రయత్నం మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. పురాణాల్లో కీలక ఇతిహాసంగా పేరున్న మహాభారతాన్ని అధ్యయనం చేసే పనిలో పడ్డారు. రాజకీయాలు ఎలా ఉంటాయి, పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి, వాటిని ఎదుర్కునేందుకు చేపట్టాల్సిన వ్యూహాలు వంటి విషయాల్లో పట్టుకోసం జగన్ ఈ మేరకు మహాభారతాన్ని ముందు వేసుకున్నట్లు తెలుస్తోంది.
స్తితప్రజ్ఞత - ఎత్తులు-పైఎత్తులు - సమన్వయం వంటి విషయాల్లో మహాభారతంలో అద్భుతమైన సమాచారం ఉందని ఓ ప్రముఖుడు ఇచ్చిన సలహాతో జగన్ ఈ మేరకు అధ్యయనం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా విద్యాభ్యాసం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో కావడం - మహాభారతంలో ఉండే కొన్ని సంస్కృత పదాలను అర్థం చేసుకోవడంలో జగన్ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసే ఓ కాలమిస్ట్ తో జగన్ మహాభారతాన్ని చదివించుకొని ఆకలింపు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్ ఈ కొత్త స్టెప్ వెనుక కారణం ఏంటో చూడాలి మరి.