Begin typing your search above and press return to search.
పాపులర్ సీఎంల జాబితాలో మూడో స్థానంలో జగన్ !
By: Tupaki Desk | 8 Aug 2020 4:45 AM GMTతాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్..దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు అనే దానిపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేను ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' .. జులై 15 నుంచి 27 మధ్య చేపట్టింది. ఇందులో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ బెస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సర్వే లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో ప్లేస్ లో ఉన్నారు. కాగా, అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మొదటి స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
అలాగే , ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగో స్థానంలో , ఇతరులు 5, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ 6, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే 7, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 8, తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేకరించారని సమాచారం.
ఇకపోతే , ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు అన్న దానితో పాటుగా , దేశానికీ తర్వాత ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారని మరో సర్వే కూడా నిర్వహించారు. ఇందులో దేశప్రజలు మోడీ కే పట్టం కట్టారు. ఈ సర్వే లో మోడీ మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 66 శాతం మంచి ఓట్లు వేశారు. అలాగే రాహుల్ కి మద్దతుగా కేవలం 8 శాతం మంది మాత్రమే నిలిచారు. మూడో స్థానం దక్కించుకున్న సోనియా 5 శాతం ఓట్లు సాధించారు. అలాగే భారత తర్వాత ప్రధానిగా అమిత్ షా , యోగి ఆదిత్యనాథ్ , అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ, రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ , శరత్ పవార్ , ఉద్ధవ్ ఠాక్రే, మాయావతి పేర్లను కూడా కొంతమంది ప్రతిపాదించారు.