Begin typing your search above and press return to search.
బాబు జంప్ జిలానీ అయ్యాడంటున్న జగన్
By: Tupaki Desk | 21 March 2017 2:22 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కీలకమైన బడ్జెట్ - కేంద్ర-రాష్ట్ర నిధుల కేటాయింపుల విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి గైర్హాజరు అవడాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమైన చర్చ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు గైర్హాజరు అయి తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారని జగన్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరుగుతుంటే తన మనవడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వెళ్లడం సరికాదని జగన్ అన్నారు.
చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు వేడుకకు వెళ్లడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదని అయితే అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత సైతం బాబు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్నే తాము ప్రస్తావిస్తున్నామని జగన్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గైర్హాజరు అవడం ఆయనకు రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యతను చాటుతోందని జగన్ వ్యాఖ్యానించారు. ఇక సభ సాగుతున్న తీరుపై స్పందిస్తూ సభలో సభ్యులందరి కంటే తానే ఎక్కువ సమయం కూర్చున్నానని జగన్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో తాము చెప్పినట్లే సభ జరగాలని కోరుకుంటున్న అధికార పార్టీ ఇందుకోసం సమావేశాలను సైతం లైట్ తీసుకునే రీతిలో ప్రవర్తిస్తోందని ఆక్షేపించారు. అధికారపక్షం తీరు కుక్కతోక వంకరలా ఉందని, సభ సాగుతున్న తీరును వారు సమీక్షించుకోవాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/