Begin typing your search above and press return to search.
టీడీపీ ఆయుధాన్ని హైజాక్ చేస్తున్న వైసీపీ
By: Tupaki Desk | 28 July 2020 4:00 AM GMTఅనాధిగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు అండగా ఉంటున్నారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు హయాం వరకు బీసీలు తెలుగు దేశాన్ని ఓన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఆలవాలంగా మారిపోయిందప్పుడు.
అయితే ఇప్పుడు అదే రెడ్డి సామాజికవర్గం చేతుల్లో ఉన్న వైసీపీ పార్టీ పూర్తిగా స్టాండ్ మార్చేయడం టీడీపీకి శరాఘాతంగా మారింది. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేయడంతో టీడీపీకి పెట్టని కోటగా ఉన్న బీసీ ఓటు బ్యాంకు చేజారిపోతోందట.. బీసీ కార్పొరేషన్ ఏర్పాటుతో వైసీపీ..తాజాగా టీడీపీని కోలుకోకుండా చేసే ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక బీసీలున్నది ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే..శ్రీకాకుళంలో బీసీ ఓటర్లదే ఆధిపత్యం. శ్రీకాకుళంలో టీడీపీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిల అరెస్ట్ లతో టీడీపీ బీసీలను అణగదొక్కేస్తున్నారని ప్రచారం చేసింది. సింపతి కొట్టేయడానికి ప్లాన్ చేస్తోంది.
దీంతో వైసీపీ గట్టిగానే బదులిస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా బీసీ అయిన సీదిరి అప్పలరాజను జగన్ తన మంత్రి వర్గంలోకి తీసుకొని శ్రీకాకుళంలో బీసీలకు పెద్దపీట వేశారు.మంత్రి ధర్మానకు ఉప ముఖ్యమంత్రి పదవిగా ప్రమోషన్ ఇచ్చారు. స్పీకర్ సైతం బీసీనే. ఇలా టీడీపీ ప్రచారాన్ని బీసీలతోనే తిప్పి కొడుతూ జగన్ వ్యతిరేకత రాకుండా చూస్తున్నారు. టీడీపీ బీసీ ఆయుధాన్ని అదే మంత్రంతో జగన్ హైజాక్ చేస్తున్నారు.