Begin typing your search above and press return to search.
72 గంటల్లోనే సమస్యలుండవు.. జగన్ సంచలనం
By: Tupaki Desk | 30 May 2019 8:40 AM GMTఆంధ్రప్రదేశ్ లోని ఏ సమస్యను అయినా 72 గంటల్లోనే పరిష్కరిస్తానని ఏపీ నూతన సీఎం జగన్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేశాక జగన్ ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధి దారుల ఇంటికే చేరేలా వ్యవస్థను తెస్తున్నట్టు హామీఇచ్చారు. పరిపాలనలో సంస్కరణలకు వీలుగా గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ గ్రామంలో పదిమందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాటికి లక్షన్నర ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు.
నవరత్నాల్లో ఏ హామీనైనా అమలు కావడానికి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోనే సమస్య పరిష్కరిస్తానని జగన్ ప్రకటించారు.
ఇక ఆగస్టు 15 నాటికి రెండున్నర నెలల్లోనే గ్రామ వలంటీర్లుగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందేలా ఈ వలంటీర్లు పనిచేస్తారని జగన్ చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు ఒక్క గ్రామ వలంటీర్ ను నియమిస్తామన్నారు. సేవ చేసే ఉద్దేశం ఉన్న యువతకు ఉద్యోగాలను ఇస్తామన్నారు. వలంటీర్ కు ప్రతి నెల 5వేల రూపాయల వేతనాన్ని ఇస్తామని జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరికి అందేలాచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో పార్టీలు, ప్రాంతాలు అనే వివక్ష చూపనని జగన్ ప్రకటించారు.