Begin typing your search above and press return to search.
జగన్ ప్రజాదర్బార్ వాయిదా.. కారణం ఇదే!
By: Tupaki Desk | 1 July 2019 5:39 AM GMTవరుస నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి తాను అనుకున్న పనిని అనుకున్నట్లుగా పూర్తి చేసేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. కేవలం నెల రోజుల పాలనతోనే తన మార్క్ ను చూపించటమే కాదు.. ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు కలిగేలా చేశారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. సామాన్య ప్రజలు సైతం సీఎంను నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించేందుకు ప్రజాదర్బార్ ను ఈ రోజు (సోమవారం) నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేయటం తెలిసిందే.
అయితే.. అనుకోని రీతిలో ప్రజాదర్బార్ ను వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారు. దివంగత మహానేత పాలనలో అందరూ గుర్తు ఉంచుకునే కార్యక్రమాల్లో ప్రజా దర్బార్ ఒకటి. సామాన్యులు తమ ఎదుర్కొంటున్న కష్టాల్ని.. సమస్యల్ని స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికే తీసుకొచ్చేందుకు రూపొందించే ఈ కార్యక్రమాన్ని వైఎస్ తర్వాత ముఖ్యమంత్రులు ఎవరూ నిర్వహించింది లేదు.
తాను పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజాదర్బార్ ఏర్పాటుకు అవసరమైనన్ని చర్యల్ని తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అయితే.. సాంకేతికంగా కొన్ని అంశాలు సిద్ధం కాకపోవటంతో ప్రజాదర్బార్ ను వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారు. కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించినా ఫర్లేదు కానీ.. సమస్యలు తెలపటానికి వచ్చే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
సీఎంకు సమస్యలు చెప్పేందుకు వచ్చే సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మౌలిక వసతుల ఏర్పాటుకు మరో వారం పడుతుందని.. ఆ వెంటనే ఇతర కార్యక్రమాలు ఉన్నందున ఆగస్టు నుంచి ప్రజాదర్బార్ ను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఇమేజ్ ను భారీగా పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న ప్రజాదర్బార్ ప్రోగ్రాం వాయిదా పడటం కాస్తంత నిరాశను కలిగించే అంశంగా చెప్పక తప్పదు.