Begin typing your search above and press return to search.
మాకీ డిజైన్ ను జగన్ పొగిడేశారే..
By: Tupaki Desk | 27 March 2016 5:22 AM GMTఏ చిన్న అవకాశం వచ్చినా ఏపీ ముఖ్యమంత్రి మీదా.. చంద్రబాబు సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఏపీ విపక్ష నేత జగన్ తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించారా? చంద్రబాబును పొగిడేశారా? అన్న భావన తలెత్తేలా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. బాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడమే లక్ష్యంగా వ్యవహరించే జగన్ అండ్ కో.. అందుకు భిన్నంగా తొలిసారి వ్యవహరించినట్లు కనిపిస్తుంది.
ఏపీ ప్రజల కలల రాజధాని అయిన అమరావతిలో నిర్మించే కట్టడాలకు సంబంధించి నిపుణుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన మాకీ డిజైన్ ను జగన్ పత్రిక సాక్షి పొగిడేయటమే దీనికి కారణం. రాజ్ పథ్ మాదిరి మాకీ డిజైన్ ఉందని చెబుతూ.. ఒక పాజిటివ్ స్టోరీ సాక్షిలో రావటం ఆసక్తికరం. ప్రతి విషయంలోనూ తప్పులు ఎంచే సాక్షి అందుకు భిన్నంగా.. అమరావతిలో నిర్మించే భవనాల నమూనాపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. డిజైన్ లో పేర్కొన్న విధంగా పచ్చిక బయళ్లతో.. నీటి వనరులు పుష్కలంగా ఉండేలా ఉన్న డిజైన్ పై తన పత్రికలో.. ‘‘రాజ్ పథ్ లా రాజధాని పరిపాలన భవనాల డిజైన్’’ అంటూ చెప్పటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
మొత్తం 900 ఎకరాల్లో నిర్మించే నిర్మాణాల్లో 30 శాతం విస్తీర్ణాన్ని పూర్తిగా పచ్చదనానికి కేటాయించారని.. ఐకానిక్ నిర్మాణాలుగా చెబుతున్న రెండు భవనాలు అసెంబ్లీ.. హైకోర్ట్ లకు సంబంధించి.. అసెంబ్లీ భవన నిర్మాణానికే ఏపీ సర్కారు ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని చిన్నపాటి మెలి పెట్టటం కనిపిస్తుంది. ఏమైనా.. జగన్ బ్యాచ్ రాసే ఘాటు కథనాలతో పోల్చినప్పుడు ఈ మెలి పెద్దదేం కాదని చెప్పాలి. ఏమైనా.. మాకీ నమూనాపై జగన్ పత్రిక పాజిటివ్ గా రియాక్ట్ కావటం ఆసక్తికర పరిణామం.