Begin typing your search above and press return to search.

మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈసారి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడానా?

By:  Tupaki Desk   |   13 Oct 2020 5:00 AM GMT
మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈసారి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడానా?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక అలవాటు ఉంది. అదే పనిగా ఢిల్లీకి వెళ్లటాన్ని ఆయన ఇష్టపడరు. అవసరం ఉంటే తప్పించి రాష్ట్రం దాటే అలవాటు ఆయనకు తక్కువగా చెబుతారు. అలాంటి జగన్.. తన తీరుకు భిన్నంగా వారం కూడా కాక ముందే ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఆయన ఢిల్లీ ట్రిప్ కు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారిన వేళ.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాలనుకోవటం ఆసక్తికరంగా మారింది. మరింత.. ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే.. తన తాజా ట్రిప్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలవనున్నట్లు చెబుతున్నారు. తన ఢిల్లీ పర్యటన ఎజెండా ఏమిటన్న విషయాన్ని జగన్ అండ్ కో ఇప్పటివరకు బయటపెట్టలేదు.

ఇదిలా ఉండగా.. జగన్ ఢిల్లీ టూర్ లో భాగంగా రాష్ట్రపతి.. ప్రధానుల అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి ఓకే అన్న మాట వచ్చినంతనే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా సాగితే.. మరో రెండు రోజుల వ్యవధిలోనే ఢిల్లీకి వెళ్లే వీలుందని చెబుతున్నారు. కీలకమైన అంశాల మీద చర్చలు జరిపేందుకే ప్రధాని మోడీతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ తో భేటీకి ప్రధాని మోడీ ఓకే చెబుతారా? అన్నది ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.