Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ ఎమ్మెల్యే బామ్మర్ది అంత రచ్చ చేస్తున్నాడట

By:  Tupaki Desk   |   29 July 2020 6:00 AM GMT
జగన్ పార్టీ ఎమ్మెల్యే బామ్మర్ది అంత రచ్చ చేస్తున్నాడట
X
అధినేత సరిగా ఉంటే సరిపోదు. ఆయన ఒక్కరు కష్టపడితేనే ఫలితాలు రావు. అందునా రాజకీయ పార్టీలో మరింత కీలకం. ఇక.. అధికార పార్టీ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు అందరూ కష్టపడాల్సిందే. ఏ ఒక్కరు తప్పు చేసినా.. ప్రభుత్వానికి చిరాకు తప్పదు. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

క్రిష్ణా జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే దగ్గరి బంధువు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయన కన్ను విజయవాడకు దగ్గర్లోని ఒక కొండ మీద పడిందని చెబుతున్నారు. విజయవాడ గ్రామీణంలో ఉన్న కొండను టార్గెట్ చేసిన ఆ పెద్ద మనిషి.. వాస్తవానికి కొండను తవ్వాలంటే రెవెన్యూ.. మైనింగ్ అధికారుల అనుమతి చాలా అవసరం. కానీ.. అన్ని రూల్స్ తెచ్చుకోవటం టైమ్ వేస్ట్ అనుకున్నారో..తమ ప్రభుత్వంలో ఆ మాత్రం హవా చూపించలేమా? అనుకున్నారోకానీ.. ఇష్టారాజ్యంగా కొండను తవ్వేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అయితే.. వేలెత్తి చూపించకుండా ఉండేందుకు వీలుగా ఆయన వేసిన ప్లాన్ అదిరిందని చెబుతున్నారు. తాను కొండను తవ్వుతున్నది తన కోసం కాదని.. పేదలకు అవసరయ్యే స్థలాల కోసం మెరక చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మెరకలో భాగంగా 500 లారీల మట్టి.. గ్రానెట్ అక్రమ మార్గంలో అమ్మేస్తున్న వైనం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఇలా లారీల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్న ఇసుక.. గ్రానెట్ విలువ అరకోటిపైనే ఉందని చెబుతున్నారు. చూసేందుకు చిన్న అవినీతిగా అనిపించినా.. నిబంధనల్ని లైట్ తీసుకొని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బామ్మర్ది వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకపోతే.. సదరు ఎమ్మెల్యేకే కాదు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.