Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సంచ‌ల‌నం..ఇది దేశం దృష్టిని ఆక‌ర్షించేది

By:  Tupaki Desk   |   22 Jun 2020 3:00 PM GMT
జ‌గ‌న్ సంచ‌ల‌నం..ఇది దేశం దృష్టిని ఆక‌ర్షించేది
X
దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ఉధృతి దారుణంగా ఉంది. కొన్ని రాష్ట్రాలైతే స‌రిగ్గా ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌నే అప‌ప్ర‌ద‌ను ఎదుర్కుంటున్నాయి. ఇందులో తెలంగాణ పేరును ప్ర‌ధానంగా బీజేపీ నేత‌లు ప్ర‌స్తావిస్తున్నారు. మ‌రోవైపు కొన్ని రాష్ట్రాలు ప‌రీక్ష‌ల విష‌యంలో దూకుడుగా సాగుతున్నాయంటున్నారు నిపుణులు. ఏపీ చేస్తున్న టెస్టుల కార‌ణంగా ఆ రాష్ట్రాన్ని ఇలా ప్ర‌స్తావిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు కోవిడ్‌-19 పై సమీక్ష చేసి 104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికి పరీక్షలు చేయాలని సూచించారు. 90 రోజుల్లో కరోనా వైరస్‌పై సమగ్ర స్క్రీనింగ్‌ చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌నుంద‌ని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున టెస్టులు చేస్తుండ‌టంతో..ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. ఏపీ తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంట‌ల్లో కొత్తగా 16,704 శాంపిల్స్ ను పరీక్షించగా 443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో 392 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా.., విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారిలో 44 మందికి పాజిటివ్‌ గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 9,372కి పెరిగింది. మృతుల సంఖ్య 111కి పెరిగింది. తాజాగా సీఎం జ‌గ‌న్ ఈ మ‌హ‌మ్మారిపై స‌మీక్ష నిర్వ‌హించి ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్ శాంపిల్స్ సేకరణతో పాటు బీపీ, షుగర్ కూడా చెక్ చేయాలని జగన్ పేర్కొన్నారు. అవసరమున్నవారికి అక్కడే మందులివ్వాలని, అంతేకాక నెలలో ఒక్కరోజు తప్పనిసరిగా 104 వాహనం గ్రామాల్లోకి వెళ్లాలని జగన్ ఆదేశించారు. 50 శాతం పరీక్షలు కంటైన్మెంట్ జోన్లలో చేస్తున్నామని, సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని, వైరస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేలా హోర్డింగ్స్ పెట్టాలని ఆధికారులను ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌ మెంట్‌ పై కూడా సీఎం జగన్ ఆరా తీశారు. కాగా, ఆరోగ్య శ్రీ బీమా ప‌థ‌కం కింద‌కు చేర్చిన మొద‌టి రాష్ట్రం ఏపీ కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఏపీలో క‌‌రోనా బారిన ప‌డి ప్ర‌స్తుతం 4,826 మంది చికిత్స పొందుతుండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 4,435 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 1584 మందికి కరోనా సోకింది. ఇందులో 638 యాక్టివ్ కేసులు. కరోనా నుండి కోలుకొని 946 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిలో 337 కేసులు నమోదయ్యాయి. ఇందులో 285 యాక్టివ్ గా ఉన్నాయి. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.