Begin typing your search above and press return to search.

అమరావతా? సంక్షేమమా? తేల్చుకోవాలన్న జగన్

By:  Tupaki Desk   |   21 Jan 2020 7:53 AM GMT
అమరావతా? సంక్షేమమా? తేల్చుకోవాలన్న జగన్
X
అసెంబ్లీ సాక్షి గా ఏపీకి 3 రాజధానులు ఎందుకు అవసరమో సీఎం జగన్ కళ్లకు కట్టారు. 3 రాజధానుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఏపీలో దారుణ పరిస్థితులున్నాయని.. స్కూళ్లు, ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని.. తాగడానికి, సాగుకు నీళ్లు లేవని.. అలాంటి దుర్భరమైన పరిస్థితులు చక్కదిద్దకుండా అమరావతి పై లక్ష కోట్లు ఖర్చు పెట్టి అప్పుల పాలై అడుక్కుతిందామా అని సూటిగా ప్రశ్నించారు.

ఏపీలో ఆస్పత్రులలో జనరేటర్లు లేక సెల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారని.. స్కూళ్లలో బాత్రూంలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని.. పాఠశాలలు కూలుతున్నాయని.. అందుకే ముందు వాటిని నెరవేర్చడానికి తాను ‘నాడు-నేడు’ చేపట్టానని జగన్ వివరించారు. 50లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. 46 లక్షల మందికి రైతు భరోసానిస్తున్నామని.. అమ్మఒడితో ఏటా 15వేలు ఇస్తూ బడిపిల్లలను బాడిబాట పట్టిస్తున్నామని జగన్ వివరించారు..

చంద్రబాబు చెప్పినట్టు గ్రాఫిక్స్ అమరావతి కట్టాలంటే.. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్ని ఆగిపోతాయని.. సంక్షేమం కావాలా? అమరావతి కావాలా తేల్చుకోవాలని జగన్ సూటిగా ప్రశ్నించడం జనాల్లో చర్చనీయాంశమైంది.

చంద్రబాబు గారి ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల వల్ల ఇప్పటికే ఏపీ 2.57లక్షల కోట్ల అప్పుతో నడుస్తోందని.. అమరావతికి లక్ష కోట్లు అప్పు చేస్తే అందరం రోడ్డున పడడమే అని లెక్కలతో వివరించి జగన్ అందరిలోనూ ఆలోచన తీసుకొచ్చారు.

సీఎం జగన్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ లెక్కలతో చంద్రబాబును కొట్టిన తీరు ఆకట్టుకుంది. సంక్షేమం కావాలా? అమరావతి కావాలా అన్న పిలుపు వైరల్ గా మారింది.