Begin typing your search above and press return to search.

జగన్ ఆవేదనకు అక్షర రూపం

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:46 AM GMT
జగన్ ఆవేదనకు అక్షర రూపం
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ మోహన రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బుందుల పాలు చేస్తున్నారో ఆయన రాసిన బహిరంగ లేఖ ద్వారా తెలుస్తోంది. గడచిన కొన్ని సంవత్సారాలుగా తనని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ఇప్పుడు తన కుటుంబ సభ్యులను కూడా వీటిలోకి లాగుతున్నారని జగన్ తన బహిరంగా లేఖలో పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ తో చేతులు కలుపుతోందని లేఖలో పేర్కొన్నారు. తన రాజకీయ అవసరాలు కోసం - అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని జగన్ అన్నారు. మసీదులు కూల్చే పార్టీతో తాము చేతులు కలపమన్న చంద్రబాబు నాయుడు 2014లో మాత్రం బిజేపీతో చేతులు కలిపారని లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై నాలుగేళ్ల వరకూ ప్రస్తావించని చంద్రబాబు నాయుడు తాము ఉద్యమం చేపట్టగానే ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగేళ్ల వరకూ గుర్తు రాని అంశం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ ను విమర్శించిన చంద్రబాబు నాయుడు తన పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటూ ఎద్దేవ చేసారని - ఇప్పుడు అదే కాంగ్రెస్‌ తో చేతులు కలుపుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇటీవల హైదారబాద్ వచ్చిన రాహాల్ గాంథీతో పారిశ్రామికవేత్తల సమావేశం నిర్వహించారని ,దీనికి తన కోడలు బ్రహ్మణిని పంపారని లేఖలో పేర్కోన్నారు. ఈ కలయిక వెనుక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసే కుట్ర దాగున్నదని జగన్ స్పష్టం చేసారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సోని‍యాతో పోరాడి తాను 16 నెలలు జైలులో ఉన్నానని, అయితే చంద్రబాబు మాత్రం తనను కాంగ్రెస్ మనిషిగా ప్రచారం చేసారని దుయ్యబట్టారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసేందుకు ఉవ్విళూరుతున్నారన్నారు. ఇన్నాళ్లు ప్రజల కోసం పనిచేసిన తన తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిలాగే తాను కూడా పనిచేస్తానని ఆ లేఖలో జగన్ స్పష‌్టం చేసారు. తనపై రాజరకీయంగా ఎన్ని కుట్రలు చేసినా భరించానని, ఇప్పుడు తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేయడం తనను కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ బహిరంగా లేఖ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సానుభూతి వ్యక్తం కావడం విశేషం.