Begin typing your search above and press return to search.

జగన్ కొత్త ఫార్ములా.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు?

By:  Tupaki Desk   |   20 Sept 2019 12:59 PM IST
జగన్ కొత్త ఫార్ములా.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు?
X
జగన్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఉప్పు నిప్పులు కలిశారు. బలమైన సామాజికవర్గం అండ జగన్ కు దొరికింది. ఒక్క బలమైన నేతతో ఆ జిల్లా రాజకీయాలనే జగన్ మార్చేశారు. ఇప్పుడు ఇక్కడ అమలైన కొత్త ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి జగన్ రెడీ అయిపోయారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పునిప్పులా ఉండేవారు మంత్రి సుభాష్ చంద్రబోస్ - కాపు నేత తోట త్రిమూర్తులు. ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులను జగన్ కలిపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న తోట త్రిమూర్తులు చేరికతో కాపు ఓటు బ్యాంకు వైసీపీకి కలిసివచ్చింది.

పోయిన ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గంలో 30 నుంచి 40వేల ఓట్లు పవన్ కళ్యాణ్ జనసేనకు పడ్డాయి. ఇప్పుడు కాపుల నేతలు వైసీపీలో చేరికతో ఆ ఓట్లన్నీ వైసీపీకి మారుతాయని వైసీపీ అధిష్టానం ధీమాతో ఉంది.

ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అమలైన ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో జగన్ ఇలానే బలమైన నేతలు ఇద్దరున్న నియోజకవర్గాలపై కన్నేశారు. వైసీపీ చేరేందుకు చూస్తున్న వారిపై ఫోకస్ చేశారట.. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేసి ఫ్యాక్షన్ గొడవలను తగ్గించేశారు. అందుకే ఇప్పుడు అనంతపురం - కడప - కర్నూలు జిల్లాలో ఇదే ఫార్ములా అప్లై చేసి రాజకీయ ప్రత్యర్థులను ఒక్కటి చేసి వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్ పక్కా స్కెచ్ గీసినట్టు సమాచారం.