Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అంచ‌నా చేర‌ని ఆత్మ‌కూరు!

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:51 PM GMT
జ‌గ‌న్ అంచ‌నా చేర‌ని ఆత్మ‌కూరు!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ అంచ‌నాలు త‌ల‌కిందులు అవుతున్నాయా? ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేరేలా క‌ని పించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూ రు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షాలు త‌న పైనా.. త‌న ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నందున వాటికి చెక్ పెట్టాల‌ని.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యిం చుకున్నారు. ఈ క్ర‌మంలో ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని నిర్ణ‌యించు కున్నా రు.

అందుకే ఆది నుంచి కూడా ఆత్మకూరుపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో ల‌క్ష ఓట్ల మెజారిటీ దాటించి.. ఇది త‌న ప్ర‌బుత్వానికి ప్ర‌జ‌లు ఇచ్చిన `ఆమోదం`గా ప్ర‌చారం చేసుకోవాల‌ని.. జ‌గ‌న్ భావించారు.ఈ క్ర‌మంలోనే మండలానికో మంత్రిని బాధ్యులుగా నియ‌మించారు. ఈ క్ర‌మంలోనే.. మం త్రులు కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. తీరిక లేకుండా నెల్లూరులో నే మ‌కాం వేసి మ‌రీ.. ప్ర‌చారం చేప‌ట్టారు.. వాస్త‌వానికి ఇది మంత్రి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో వ‌చ్చిన ఎన్నిక‌.

సో.. ఆయ‌న కుటుంబంపై ఉన్న సింప‌తీ.. జోరుగా పోలింగ్ బూతుల్లో ఓట్ల‌రూపంలో ప‌డుతుంద‌నేది వాస్త వం. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ భారీఎత్తున శ్ర‌ద్ధ తీసుకున్నారు.

క‌ట్ చేస్తే.. గురువారం ఉప ఎన్నిక ముగిసిం ది. కానీ, జ‌గ‌న్ ఆశ‌లు ప‌లించేలా లేవ‌ని ఈ ఎన్నిక‌ల స‌ర‌ళిని చూసిన వారు అంచ‌నా వేస్తున్నారు. దీనికి కార‌ణం.. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. ఇప్పుడు పోలింగ్ శాతం 10 వ‌ర‌కు త‌గ్గిపోయింది. అత్యంత కీల‌క‌మైన‌... ఆత్మ‌కూరు మండ‌లంలోనే ఆశించిన పోలింగ్ న‌మోదు కాలేదు.

దీంతో సీఎం జ‌గ‌న్ పెట్టుకున్న ల‌క్ష మెజారిటీ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇత‌ర పార్టీలు ఇక్క‌డ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌క‌పోయినా.. బీజేపీ మాత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇక్క‌డ ప్ర‌య‌త్నించిం ది. దీనికి తోడు.. 13 మంది ఇత‌ర పార్టీలు.. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా రంగంలోకి దిగారు. దీంతో ఎస్సీ, బీసీ ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. ఇక్క‌డ ల‌క్ష మెజారిటీ దాట‌డం అనేది అసాధ్య‌మ‌ని వైసీపీ నేత‌లు కూడా అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.