Begin typing your search above and press return to search.
బాబు కంటే ముందే రెడీ అయిన జగన్
By: Tupaki Desk | 9 Sep 2016 5:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న ఏడు కార్పోరేషన్లు - ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఎన్నికల్లో ఎక్కడా అతి విశ్వాసంతో ముందుకువెళ్లి చేతులు కాల్చుకొనే పనిచేయొద్దని డిసైడంది. అంతేకాకుండా స్థానికంగా వామపక్ష పార్టీలతో అవగాహనచేసుకొని ముందుకెళ్లాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. ఆ దిశగా ఇప్పటినుంచే చర్చలు ప్రారంభించాలని పార్టీ ముఖ్యనేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కార్పోరేషన్లు - మున్సిపల్ ఎన్నికలు జరిగే జిల్లాల ముఖ్యనేతలతో - పార్టీ ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలకు ఈ మేరకు జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అశ్రద్దవహించకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తులను సైతం తన పార్టీ నేతలకు జగన్ ముందే వివరించారని సమాచారం.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఏడు కార్పోరేషన్లు - ఐదు మున్సిపాలిటీలలో అవసరమున్న చోట స్థానికంగా ఎక్కడికక్కడా వామపక్ష పార్టీలతో అవగాహన చేసుకోవాలని తన పార్టీ ముఖ్యనేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ఎక్కు వ సమయం లేనందున ఇప్పటినుంచి వామపక్ష పార్టీలతో అవగాహన కోసం ప్రయత్నాలు మొదలెట్టాలని జగన్ సూచించారు. వామపక్షాల బలంమేరకు వారికి సీట్లు ఇచ్చేలా ఇప్పటినుంచే ఓ అవగాహనకు రావాలని సీనియర్ నేతలకు జగన్ తెలియజేశారు. ఈ ఎన్నికలను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేశారు. కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తిగత పలుకుబడికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలను ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పార్టీనేతలకు జగన్ సూచించినట్లు సమాచారం. జనంలో ఏనేతకు గుర్తింపు ఉంది, అతనికి ఎంతటి ప్రాధాన్యత ఉంది ఇత్యాధి అంశాల ఆధారంగా ఈ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని పార్టీ నేతలకు సూచించనట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా ఆ తరువాత మేయర్ - ఛైర్ పర్సన్ ఎంపిక సమయంలో అధికార టీడీపీ డబ్బులు వెద్దజల్లి తన ప్రాభల్యం చాటుకొందని జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ సారి ఈ కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ ధన ప్రవాహం కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఎదురోడి తట్టుకొనే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఎంపిక చేయాలని ఆయన ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ ముఖ్యనేతలు స్థానిక నేతలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఎక్కడా కూడా ఈ సఖ్యత, సమన్వయంలో దూరంపెరిగితే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటినుంచే ప్రజా సమస్యలపై స్థానికంగా పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామ స్థాయిలోకంటే పట్టణాలలో కొంత క్యాడర్‌ను బలోపేతం కావాల్సిన అవసరముందని ఆ దిశగా కూడా పార్టీ ముఖ్యనేతలు చొరవచూపాలని జగన్ సూచించినట్లు తెలిసింది, అదే విధంగా పార్టీ ముఖ్యనేతలు ఎన్నికలు జరిగే కార్పోరేషన్లకు - మున్సిపాలిటీలకు పరిశీలకులుగా నియమిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.