Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ రాకకు కార‌ణం అదేనా ? ఓవ‌ర్ టు ఆచార్య!

By:  Tupaki Desk   |   16 April 2022 10:34 AM GMT
జ‌గ‌న్ రాకకు కార‌ణం అదేనా ? ఓవ‌ర్ టు ఆచార్య!
X
టికెట్ రేట్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంతో ఆంధ్రా సీఎం జ‌గ‌న్ ఇండస్ట్రీ వ‌ర్గాల‌కు మ‌రింత చేరువ అయ్యారు. స‌వ‌రించిన జీఓ ను వీలున్నంత త్వ‌ర‌గా విడుద‌ల చేసి ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఎంతో మేలు చేశారు. ఆవిధంగా ఇవాళ ట్రిపుల్ ఆర్ కానీ కేజీఎఫ్ కానీ మంచి వసూళ్లు ద‌క్కించుకున్నాయంటే కార‌ణం అందుకు స‌వ‌రించిన టికెట్ ధ‌ర‌లే అని వేరేగా చెప్ప‌నవ‌స‌రం లేదు.

ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ విష‌య‌మై ఉన్న టెన్ష‌న్ అంతా పోయింది రాజ‌మౌళికి. రాధే శ్యామ్ కు కూడా సీఎం చేసిన హెల్ప్ క‌లిసి రావాల్సిందే కానీ ఆ సినిమా రూపుదిద్దుకున్న వైనం బాగుండ‌క ఆశించిన రీతిలో క‌లెక్ష‌న్లు అన్న‌వి రాలేదు అన్న‌ది ఒప్పుకోద‌గ్గ నిజం.

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్ర‌స్టింగ్ అప్టేడ్ తో ఇండ‌స్ట్రీలో ఆనందోత్సాహాలు వెల్లువ‌కు నోచుకుంటున్నాయి. చాలా రోజుల‌కు ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ కెరియ‌ర్ లో తొలిసారి ఓ సినిమా ఫంక్ష‌న్ కు అతిథిగా విచ్చేయ‌నుండ‌డం.

ఈ వార్త విని జ‌గ‌న్ అభిమానులే కాదు మెగాస్టార్ అభిమానులు కూడా ఆనందిస్తున్నారు. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. విజ‌య‌వాడ సిద్ధార్థ్ కాలేజ్ ఆవ‌ర‌ణ‌లో ఈ నెల 23న జ‌రిగే వేడుక‌కు ఆయ‌నే అతిథి. దీంతో ఇండ‌స్ట్రీ లో ఈ వార్త భ‌లే హ‌ల్చ‌ల్ చేస్తోంది. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో కూడా ఈ వార్త‌కు సంబంధించి ఓ మంచి ఆస‌క్తి నెల‌కొంది.

వాస్త‌వానికి చిరుకు వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ టికెట్ ఇస్తార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవి నిజంగా నిజం కావ‌ని చిరు తేల్చేశారు. ఆ మ‌ధ్య టికెట్ ఇష్యూస్ పైనే మాట్లాడేందుకు జ‌గ‌న్ తో భేటీ అయిన సంద‌ర్భంగా కొన్ని అబ‌ద్ధ‌పు లేదా నిరాధార వార్త‌లు న‌డిచాయి.

దీనిని చిరు ఖండించారు. అటుపై చిరు తీసుకున్న చొరవ కార‌ణంగా టికెట్ రేట్ల పెంపుపై ప్ర‌భుత్వం పునరాలోచన చేసుకుని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. ఈ త‌రుణాన జ‌గ‌న్ ను స‌న్మానించాల‌ని ఇండ‌స్ట్రీ భావించింది. ఇప్పుడు ఆచార్య టీం త‌ర‌ఫున జ‌గ‌న్ ను స‌న్మానించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిరును స్టార్ క్యాంపైన‌ర్ గా వైసీపీ తర‌ఫున ఉండ‌బోతున్నారా అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. అందుకు సంకేతిక‌గా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక‌కు జ‌గ‌న్ రానున్నారా? అన్న సందేహాలు మ‌రియు సందిగ్ధ‌త‌లు నెల‌కొని ఉన్నాయి.