Begin typing your search above and press return to search.
వైఎస్ బర్త్ డేను ఇకపై అలా చేయనున్నారు!
By: Tupaki Desk | 25 Jun 2019 4:47 AM GMTతనకు ముందు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారెవరూ చేయని రీతిలో అనునిత్యం రైతుల గురించి.. రైతు సంక్షేమం గురించి విపరీతంగా శ్రమించిన ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్పాలి. అలాంటి ఆయన పుట్టిన రోజును రాష్ట్రంలో కొత్త తరహాలో జరపాలని నిర్ణయించారు.
ఇకనుంచి వైఎస్ జయంతి అయిన జులై 8ని రైతు దినోత్సవంగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తాజాగా చేపట్టిన కలెక్టర్ల సదస్సులో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. వైఎస్ జయంతి రోజున పంటల బీమా.. రైతులకు వడ్డీలేని రుణం తదితర అంశాలకు సంబంధించిన చెల్లింపుల్ని ఆ రోజున చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ మాదిరి నిర్వహిద్దామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12500 పెట్టుబడిని అక్టోబరు 15న రాష్ట్రమంతా ఒకేరోజు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతులకే కాదు కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు.. పెట్టుబడి రాయితీ.. పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాల్ని పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తేల్చారు జగన్.
గ్రామాల్లో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాల్ని రానున్న రోజుల్లో భర్తీ చేసే అవకాశం లేదని తేల్చిన ఏపీ సీఎం.. రానున్న రోజుల్లో గ్రామ వలంటీర్లే ఇంటింటికి నిత్యావసర సరుకుల్ని సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. మొత్తంగా కీలక నిర్ణయాల్ని వెనువెంటనే తీసుకుంటున్న జగన్.. పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పక తప్పదు.