Begin typing your search above and press return to search.

జగన్ యాంటీ.. టాలీవుడ్ వెనకున్నదెవరు?

By:  Tupaki Desk   |   27 July 2019 9:09 AM GMT
జగన్ యాంటీ.. టాలీవుడ్ వెనకున్నదెవరు?
X
అది అలాంటి ఇలాంటి గెలుపు కాదు.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేశారు జగన్. 151 సీట్లు సాధించి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును చిత్తుగా ఓడించారు. అంతటి గొప్ప విజయం సాధించగానే జగన్ పొంగిపోలేదు. వెంటనే గద్దెనెక్కి సామాజిక సమీకరణాలతో పదవులు ఇచ్చి తన నవరత్నాల పథకాలను పట్టాలెక్కించారు. రెండు నెలలుగా కీలక బిల్లులు - చట్టసవరణలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ రెండో సారి గెలవగానే టాలీవుడ్ పెద్దలు ఆయన దర్శనానికి.. అభినందించడానికి క్యూ కట్టారు. ఇక చంద్రబాబుతో టాలీవుడ్ కు ఉన్న దోస్తీ అంతా ఇంతాకాదు.. టీడీపీలో టాలీవుడ్ పెద్దలు ఎంపీలు - ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. బాబు పట్ల ఎప్పుడూ గురుతర బాధ్యతగానే ఉంటారు.

కానీ జగన్ గద్దెనెక్కాక మాత్రం ఏ టాలీవుడ్ పెద్దలు కనీసం అభినందించడానికి రాలేదు. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన కోసం జగన్ ఎవ్వరినీ కలవడానికి సమయం ఇవ్వలేదట.. ఇప్పుడు రెండు నెలల పాలన పూర్తయ్యింది. కానీ ఇప్పటికీ టాలీవుడ్ పెద్దలు అసలు జగన్ ను కలవడానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారిందట. అసలు జగన్ గెలుపును వారు ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది..

ఏపీ వైపు చూడని టాలీవుడ్ వెనుక ఎవరున్నారనది తేల్చే పనిలో పడిందట వైసీపీ వర్గాలు. అసలు జగన్ ను సీఎంగా గుర్తించడానికే ఒప్పుకోని ఆ నేతలపై ఇప్పుడు నజర్ పెట్టినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది పొలిటికల్ సర్కిల్స్, టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.