Begin typing your search above and press return to search.

రచ్చబండ మీద జగన్ పునరాలోచిస్తే మంచిదా?

By:  Tupaki Desk   |   29 Sept 2019 12:45 PM IST
రచ్చబండ మీద జగన్ పునరాలోచిస్తే మంచిదా?
X
సెంటిమెంట్లను హేతువాదులు అస్సలు నమ్మరు. దాన్ని పరిగణలోకి తీసుకోరు. అలాంటి వాటి గురించి చెబితే.. చిత్రంగా చూడటమే కాదు చదువుకున్నోడికి ఇలా మాట్లాడతావా? అని తిట్టేస్తుంటారు. మరి.. మన చుట్టూ జరిగే కొన్ని అంశాల్నిచూపించి.. మరి దీని లాజిక్కు ఏంటి బాబు? అంటే సమాధానం చెప్పలేకపోతుంటారు.

శాస్త్రీయంగా నిజమా? కాదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. కొన్ని కొంతమందికి ఎంతకూ అచ్చిరావు. బాబు చేతికి పవర్ వస్తే చాలు.. వర్షాలు ముఖం చాటేస్తాయి. ఒకవేళ పడినా.. అతిగా పడటమో.. హుదూధ్ లాంటివే తప్పించి.. అవసరానికి తగ్గట్లు అస్సలు ఉండదు.

ఈ కారణంతోనే చంద్రబాబును ఐరెన్ లెగ్ గా అభివర్ణించే వారు లేకపోలేదు. ఇక.. దివంగత మహానేత వైఎస్ విషయానికి వస్తే.. ఆయన మరణం ఇప్పటికి జీర్ణించుకోలేని పరిస్థితి. రచ్చబండ పథకాన్ని లాంఛ్ చేయటానికి హెలికాఫ్టర్ లో బయలుదేరిన ఆయన ప్రమాదానికి లోనై.. దుర్మరణానికి గురయ్యారు.

వైఎస్ మరణించిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. తన తండ్రి ప్రారంభించాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి తాను స్టార్ట్ చేయాలని జగన్ భావించారు. సరిగ్గా ఆ పథకానికి సంబందించిన కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన సందర్భంగా చాపర్ ల్యాండింగ్ సమస్య ఎదురు కావటం తెలిసిందే.

దీనిపై సీఎంవో ఆరా తీసి.. అసలేం జరిగిందన్న కారాణాల పై ఆరా తీశారు. రచ్చబండ జగన్ కు కూడా కలిసి రాలేదన్న మాట వైఎస్ సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది. కలిసి రాని రచ్చబండ కార్యక్రమానికి చెక్ చెప్పేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం చాపర్ ల్యాండింగ్ విషయంలో చోటు చేసుకున్న వ్యవహారంపై ఆరా తీసిన కర్నూలు కలెక్టరేట్ ఇప్పటికి ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. మొత్తంగా రచ్చబండ కార్యక్రమం విషయంలో జగన్ పునరాలోచన చేస్తే మంచిదంటున్నారు.