Begin typing your search above and press return to search.

విద్యుత్ లొల్లి.. బ్రేకులుపడ్డా జగన్ ముందుకే..

By:  Tupaki Desk   |   19 July 2019 8:05 AM GMT
విద్యుత్ లొల్లి.. బ్రేకులుపడ్డా జగన్ ముందుకే..
X
చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం.. ఎన్నో అక్రమాలు జరిగాయన్నది వైసీపీ ఆరోపణ. అయితే దాన్ని నిరూపిద్దామంటే మాత్రం నిబంధనలు వైసీపీ ప్రభుత్వానికి ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. చంద్రబాబు పక్కాగా సౌర - పవన విద్యుత్ సంస్థల నుంచి భారీ ధరకు కొని ఏపీ ఖజానాకు భారీ నష్టం చేకూర్చారని సీఎం జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు బినామీల ద్వారానే రాష్ట్ర ఖజానాను ఆయా సంస్థలకు దోచిపెట్టారని.. అందుకే ఆ విద్యుత్ కొనుగోళ్లను సమీక్షిస్తానని ప్రకటించారు.

అయితే దీనిపై కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి - కేంద్రమంత్రి సమీక్షించడానికి వీల్లేదని లేఖలు రాసి జగన్ కు స్పష్టం చేశారు. ఇక జగన్ మాత్రం ఏపీకి భారంగా మారిన చంద్రబాబు విద్యత్ కొనుగోళ్లను రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు.

తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) ద్వారా సౌర - పవన విద్యుత్ సంస్థలకు విద్యుత్ టారిఫ్ ను తగ్గించాలంటూ మూడు కంపెనీలకు నోటీసులు పంపారు. రూ. 3.74 నుంచి రూ.2.44కు తగ్గించుకోవాలంటూ జగన్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే దీనిపై తాజాగా సదురు మూడు కంపెనీలు ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాయి. టారీఫ్ తగ్గింపు సరికాదని.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా టారీఫ్ ను తగ్గించకుండా పాత ధరకే విద్యుత్ ను కొనాలని అప్పిలేట్ ట్రిబ్యూనల్ చైర్మన్ జగన్ కు సర్కారు కు స్పష్టం చేసింది.

దీంతో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని..అధిక ధరలను నియంత్రించాలని యోచించిన జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే జగన్ మాత్రం దీనిపై రెండు కమిటీలను వేసి చంద్రబాబు అక్రమాల వ్యవహారాన్ని వెలికి తీయడానికి నిర్ణయించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.