Begin typing your search above and press return to search.
జగన్ వరాల మూట... ఏపీలో విద్యకు మహార్దశే
By: Tupaki Desk | 21 Jan 2020 4:45 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ కు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత... తన పాలనలో ఏ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్న ప్రశ్న వస్తే... ఏమాత్రం సందేహించకుండా విద్యా శాఖకే అని చెప్పక తప్పదు. సీఎం హోదాలో ఇప్పటిదాకా జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలన్నింటినీ పరిశీలిస్తే... ఈ మాట అక్షరాలా నిజమని కూడా చెప్పక తప్పదు. ఈ మాట... మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ చేసిన ప్రసంగం వింటే ఇట్టే అర్థం కాక మానదు. అసెంబ్లీలో అమ్మ ఒడిపై జరిగిన చర్చలో మాట్లాడిన సందర్భంగా విద్యా శాఖకు తాను ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నానన్న విషయాన్ని జగన్ చెప్పకనే చెప్పేశారు. అమ్మ ఒడితో పాటుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ఎన్నెన్ని పథకాలను జోడిస్తున్నామన్న విషయాన్ని జగన్ చాలా క్లియర్ గానే చెప్పేశారు.
అమ్మఒడిని పేద కుటుంబాల పిల్లలు చదువుకునేలా ఆయా కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు ప్రవేశపెట్టామని జగన్ చెప్పారు. అంతేకాకుండా బడిలో చేరిన పిల్లలు ఆర్థిక కారణాల చేత డ్రాపవుట్లుగా మారకుండా కూడా అమ్మ ఒడి చేయూతనందిస్తుందని జగన్ చెప్పారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న కారణంగానే విద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కూడా జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బడి మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనిని తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం ఇదివరకే అమలు అవుతున్నా.. నాసికరం భోజనం ఉండటం, వంట చేసే వారికి కనీస వేతనాలు లేకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో ఈ పథకం నిర్వీర్యమైపోయిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ పథకానికి ‘గోరుముద్ద’ అనే పేరు పెట్టి పటిష్టంగా అమలు చేసి తీరతామని జగన్ చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద మధ్యాహ్న భోజనం చేసే పిల్లలకు రోజూ ఒకే మాదిరి ఆహారం కాకుండా... రోజుకో వెరైటీ చొప్పున నాణ్యమైన ఆహారమే కాకుండా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ పథకానికి ఎక్కడా బ్రేకుల్లేకుండా చేసే దిశగా ఆయాల వేతనాలను రూ.1 వెయ్యి నుంచి ఏకంగా రూ.3 వేలకు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు.
ఇక పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యాలయాల్లో విద్యనభ్యసించే పిల్లలతో పోటీ పడే విధంగా గ్రామీణ ప్రాంత పిల్లలను తీర్చిదిద్దుతున్నామని, ఈ క్రమంలోనే అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని జగన్ చెప్పారు. ఇందుకోసం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఆంగ్ల మాధ్యమంపై ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సింగపూర్, షికాగో, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జీ విశ్వవిద్యాలయాల సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని జగన్ చెప్పుకొచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా... అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. ఇక నాడు-నేడుతో ప్రభుత్వ విద్యాలయాల రూపు రేఖలు మార్చేస్తున్నామని ప్రకటించారు. ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఓ కిట్ అందజేస్తున్నామని... ఒక్కోటి రూ.1350 విలువ చేసే ఈ కిట్ లో మూడు జతల యూనీఫారాలు - పాఠ్యపుస్తకాలు - నోటు పుస్తకాలు - బూట్లు -సాక్సులు- బెల్టు ఉంటాయని చెప్పారు. ఇక వసతి దీవెన, విద్యా దీవెన కింద హాస్టల్ లో ఉండే విద్యార్థుల తల్లికి ఏడాదికి రెండు దఫాల్లో రూ.20 వేలు అందిస్తామని కూడా జగన్ చెప్పారు. మొత్తంగా తన జమానాలో విద్యా శాఖకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా జగన్ చెప్పకనే చెప్పారు.