Begin typing your search above and press return to search.
జగన్ నుంచి మరో గుడ్ న్యూస్..సున్నా వడ్డీ రుణాలకు గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 25 Sep 2019 4:08 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు చెబుతున్నారు. ఇప్పటికే పలు వర్గాలకు చెందిన ప్రజలకు గుడ్ న్యూస్ లు వినిపించిన జగన్... తాజాగా రైతులు - డ్వాక్రా మహిళలకు కూడా గుడ్ న్యూస్ వినిపించారు. సున్నా వడ్డీకే ఇటు రైతులతో పాటు అటు డ్వాక్రా రుణాలు అందేలా చర్యలు ప్రారంభించిన జగన్... బ్యాంకర్లకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు - డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుందని - ఈ నేపథ్యంలో బ్యాంకులు విరివిగా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం అమరావతిలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ ఎల్ బీసీ) జరిగింది. ఈ సమావేశంలో సున్నా వడ్డీ రుణాలకు సంబంధించి జగన్ చాలా విస్పష్టంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీ మేరకు రైతులు - డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తక్షణమే మొదలుపెడుతున్నట్లుగా జగన్ ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా ఈ రెండు వర్గాలకు చెందిన లబ్దిదారులకు తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా సున్నా వడ్డీకే రుణాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు చెల్లిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం కూడా జరగదని బ్యాంకర్లకు హామీ ఇచ్చారు.
సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన వడ్డీ నిధులు ఎప్పటికప్పుడు తమకు చేరితే... రైతులు - డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అక్కడికక్కడే బ్యాంకర్లు సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. రైతులు - డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాల మంజూరు విషయంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని కూడా జగన్ అటు బ్యాంకర్లతో పాటు ఇటు ప్రభుత్వాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ముద్రా రుణాలపైనా జగన్ సమీక్షించారు. చిరు దుకాణాలు - తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని - వారికి కూడా ముద్రా రుణాలను అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురుస్తున్న నేపథ్యంలో రబీ సీజన్ లో సాగు పెద్ద ఎత్తున జరగనుందని, ఈ మేరకు రుణాలు కూడా భారీగానే ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధం కావాలని కూడా జగన్ ఆదేశించారు.