Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో మిలాఖత్‌ జగన్‌ కు ఓట్లు తీసుకువస్తుందా.?

By:  Tupaki Desk   |   17 Jan 2019 8:10 AM GMT
కేసీఆర్‌ తో మిలాఖత్‌ జగన్‌ కు ఓట్లు తీసుకువస్తుందా.?
X
రాజకీయ వర్గాల్లో టీఆర్‌ ఎస్‌ - వైసీపీ పార్టీల మిలాఖత్‌..చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలను టీడీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరి ఇలాంటి టైమ్‌ లో టీఆర్‌ ఎస్‌ తో కలవడం వైసీపీకి ప్లస్‌ కానుందా - మైనస్‌ కాబోతుందా.? ఒక్కసారి చూద్దాం

తెలుగు ప్రజలకు టీఆర్‌ ఎస్‌ పార్టీపై ఎప్పుడూ వ్యతిరకేత లేదు. ఎందుకంటే.. కేసీఆర్‌ తన ప్రాంత ప్రయోజనాల కోసమే ఉద్యమం చేశారు తప్ప మరేం కాదని తెలుగువాళ్లందరి మదిలో ఉంది. అందుకే మొన్న విశాఖకు కేసీఆర్‌ వస్తే ఘనస్వాగతం పలికారు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌ పార్టీపై తెలుగు ప్రజలకు పీకలదాకా ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోవడానికి అసలు కారణం కాంగ్రెస్సే అని ఏపీ ప్రజలు నమ్మారు. అందుకే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అనేదే లేకుండా చేశారు. అన్నింటికి మించి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ పై ఏపీ ప్రజల్లో అభిప్రాయం రోజురోజుకి మారుతూ ఉంది. కేసీఆర్‌ తన రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారని నమ్ముతున్నారు. ప్రాజెక్టుల రూపకల్పన - రైతు బంధు - వృద్ధాప్య పెన్షన్‌ లాంటి స్క్రీమ్‌ లు కూడా ఏపీ ప్రజలకు నచ్చాయి. ఇలాంటి టైమ్‌ లో కేసీఆర్‌ ని కలుపుకుని పోతే.. అది జగన్‌ కు ప్లస్సే అవుతుంది తప్ప మైనస్‌ కాదు. మరోవైపు టీడీపీకి ఎటూ నెగిటివ్‌ ఓట్‌ ఉండనే ఉంటుంది. ఇవన్నీ జగన్‌ కు ప్లస్‌ అవుతాయి. వీటికితోడు పక్కన రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్ తోడుగా ఉంటే.. అ జగన్‌ కు ప్లస్సే అవుతుంది తప్ప మైనస్‌ కాదు. ఒకవేళ టీడీపీ అన్నట్లుగా.. కేసీఆర్‌ కు జగన్‌ సరెండర్‌ అయ్యారు అనే భావన ప్రజల్లో వచ్చేందుకు అవకాశం లేదు. దాదాపు ఏడాదిపాటు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యారు జగన్‌. సో.. ఎలా చూసినా.. టీఆర్‌ ఎస్‌ తో కలవడం ద్వారా వైసీపీ మరింత స్ట్రాంగ్‌ అయ్యిందనే చెప్పాలి.