Begin typing your search above and press return to search.
చిరంజీవికి జగన్ ఆఫర్ ఇచ్చారా?
By: Tupaki Desk | 23 Feb 2016 6:49 AM GMTవైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ నష్టనివారణ చర్యలు చేపడుతున్నారా? ఈ క్రమంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఆయన సమర్థంగా ఉపయోగించుకునేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారా? అంటే తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం అవుననే సమాధానం వస్తోంది. తునిలో కాపు గర్జన సభను ఏ పార్టీ నిర్వహించకుండానే అంతమంది కాపులు హాజరు కావటం జగన్‌కు ఆశ్చర్యం కలిగించిందట. ఈ ఎపిసోడ్ పై తీవ్రంగా ఆలోచించిన జగన్..ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.
పార్టీలో ఇప్పటికే కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలు అంబటి రాంబాబు - వంగవీటి రాధ లాంటి వాళ్లు ఉన్నా...వారి శక్తి సామర్ధ్యాలని సరిగ్గా ఉపయోగించటం లేదు. దీంతో కాపులను తను వైపు తిప్పుకోవటం కోసం మరో కొత్త నాయకున్ని వెతికే పనిలో జగన్ పడ్డారట. ఈ లిస్ట్ లో ఇద్దరు నాయకులు కనిపించారని అందులో ఒకరు కాపు గర్జనని దగ్గరుండి నడిపించిన ముద్రగడ అయితే..మరొకరు అదే సామాజిక వర్గంలో బలంగా ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి అని చెప్తున్నారు. మొదట ముద్రగడకు అవకాశం ఇద్దామని అనుకున్నా...కాపు గర్జన సభ తరువాత చంద్రబాబుకు అనుకూలంగా ముద్రగడ మారాడని వెనక్కి తగ్గారట. అయితే ఇప్పుడు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి చిరంజీవి మాత్రమే సో...ఈయనకి అవకాశం ఇచ్చి రానున్న ఎలక్షన్ లో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే జగన్ త్వరలో చిరంజీవి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తో కలవటం వల్ల చాల ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నారు పార్టీ వర్గాలు. 2019లో గెలిచేది జగన్ అని... పార్టీలోకి వస్తే మంచిదని చిరంజీవికి జగన్ పార్టీ వర్గాలు చెబుతున్నాయని సమాచారం. దీంతో పాటు చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినా..తనకు రాల్సినంత గౌరవం పార్టీనుంచి రావటం లేదని చిరు చాలా సార్లు తన సన్నిహితుల దగ్గరచెప్పారని అంటున్నారు. దీంతో చిరంజీవి పార్టీలోకి చేరితే జగన్ కు అటు చిరంజీవికి మేలు జరుగటం ఖాయమంటున్నారు. ఈ ప్రతిపాదన తెరమీదకు వస్తుందా? వేచి చూడాలి మరి.