Begin typing your search above and press return to search.
వారానికి 5 రోజులు కోర్టుకు రాలేనని.. వస్తే జరిగేదేమిటో చెప్పిన జగన్
By: Tupaki Desk | 4 Dec 2021 3:36 AM GMTఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కావటానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణం ఏమిటో తెలుసా? వారానికి ఐదు రోజుల పాటు విచారణకు హాజరు కావాలన్న కోర్టు కోరిన నేపథ్యంలో.. తాను వారానికి ఐదు రోజుల పాటు కోర్టుకు వచ్చిన పక్షంలో ఏపీ రాష్ట్ర డెవలప్ మెంట్ ఆగిపోతుందని తాజాగా హైకోర్టుకు పేర్కొన్నారు.
తన పై నమోదైన కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కాలేనంటూ పేర్కొన్న పిటిషన్ సీబీఐ కోర్టు కొట్టేయటంతో.. ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
దీనికి సంబంధించిన విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేపట్టారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. పాలనా పనులతో పాటు.. భద్రతా సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన్ను కలవటానికి పలువురు కోర్టులకు ఎక్కువ వస్తారని.. దాని కారణంగా అందరికి ఇబ్బందులేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కాక ముందు దాదాపుగా ప్రతివారం హాజరయ్యారని.. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారన్నారు. వీటిల్లో కొన్ని 2జీ కేసు కన్నా ఐదు రెట్లు సంక్లిష్టమైనవని.. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుందన్నారు.
ప్రతిసారి కోర్టుకు హాజరు కావటం సాధ్యం కాదని.. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు.. సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పుల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
సత్యం రామలింగరాజు కేసులో ఒక జడ్జిని పూర్తిగా కేటాయించి ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రెండేళ్లకు పైగా పట్టిందని ఉదాహరించారు.
ఈ సందర్భంలో జడ్జి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధాని పీవీపై ఉప్ప కేసులో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో నిందితులు హాజరైతే సాక్ష్యులు మాట్లాడటానికి భయపడుతుంటారని.. హైదరాబాద్ లో అలాంటి పరిస్థితులు లేవనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.