Begin typing your search above and press return to search.

తెలంగాణ సంగతంటే చాలు అంత చిరాకేంటి జగన్?

By:  Tupaki Desk   |   2 April 2016 4:39 AM GMT
తెలంగాణ సంగతంటే చాలు అంత చిరాకేంటి జగన్?
X
తెలంగాణ మాట వింటే చాలు ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని జంపింగ్స్ చేసేలా ఏపీ అధికారపక్షం వ్యవహరిస్తుందని.. అలా జంపింగ్స్ కు పాల్పడే వారి విషయంలో అనర్హత వేటు పడాలంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. జగన్ పార్టీ ఏపీలోనే అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందా? అంటే కాదని చెప్పాలి. తెలంగాణలోనూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తెలంగాణ అధికారపక్షం ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించి.. ఇద్దరిని తన వైపునకు లాగేసుకుంది. ఏపీలో జంపింగ్స్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ జగన్ మీడియా సమావేశంలో డిమాండ్ చేసినప్పుడు.. మరి.. తెలంగాణలోని ఎమ్మెల్యేల మాటేమిటి? అన్న ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్న జగన్ కు మా చెడ్డ చిరాకు తెప్పించింది. తెలంగాణ సంగతి ఎందుకు? అక్కడి ఎమ్మెల్యేల సంగతి ఎందుకు? నేనిప్పుడు సీమాంధ్ర ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నా అంటూ తెలంగాణ ప్రస్తావన తెచ్చేందుకు సైతం జగన్ ఇష్టపడకపోవటం గమనార్హం. పార్టీ అధినేతగా.. రెండు రాష్ట్రాలకు చెందిన తన ఎమ్మెల్యేల జంపింగ్స్ మీద రియాక్ట్ కావాల్సిన జగన్.. తెలంగాణ గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడకపోవటం గమనార్హం. తెలంగాణలోని తమ పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్స్ గురించి ప్రస్తావిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేయాల్సి ఉంటుంది. చూస్తూ.. చూస్తే.. జగన్ అంత సాహనం చేయగలరా?