Begin typing your search above and press return to search.
జగన్ ఆ లీడర్ కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడా?
By: Tupaki Desk | 29 April 2019 7:42 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాల మధ్యన అనేక మంది తెలుగుదేశం రాజకీయ నేతలు జగన్ కు టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని నేతలు ఇప్పటికే ఒకరిద్దరు జగన్ కు టచ్లోకి వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం.
ఈ క్రమంలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. ఈయన వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాగా పని చేసిన వ్యక్తే. అయితే అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరాడు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి.. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఈయనా ఒకరు.
జగన్ ఈయనను ఒక సోదరుడిలా చూస్తూ వచ్చారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే తండ్రికీ - వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ క్రమంలో ఈయనకు జగన్ టికెట్ కేటాయించి తన పార్టీ తరఫున గెలిపించుకున్నాడు. అయినా ఇతడు స్వార్థం చూసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఈ ఎన్నికల్లో ఇతడు తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో నెగ్గదని ఇతడు కూడా తేల్చుకున్నాడట. వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే అంచనాకు వచ్చి తిరిగి జగన్ గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నట్టుగా సమాచారం.
అందులో భాగంగా సంప్రదింపులకు కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు సాగించారట ఈయన. అయితే ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే యత్నం చేస్తున్న ఈయన విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తితో లేనట్టుగా సమాచారం. అతడికి అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది!