Begin typing your search above and press return to search.

జగన్ స్ట్రిక్ట్ . తలపట్టుకుంటున్న టీడీపీ నేతలు

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:28 PM GMT
జగన్ స్ట్రిక్ట్ . తలపట్టుకుంటున్న టీడీపీ నేతలు
X
తెలంగాణలో కేసీఆర్ - ఆంధ్రాలో మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుది అదే దారి.. ఇబ్బడి ముబ్బడిగా నేతలనే లాగేయడం.. అవసరమైతే ప్రతిపక్ష పార్టీల సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం హాబీగా చేసుకున్నారు. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవడం.. ప్రస్తుత రాజకీయాల్లో చూస్తున్నాం.

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది ఇప్పటికే కారెక్కేశారు. మరో ఇద్దరు చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం గల్లంతే. కేసీఆర్ ఆ పనిచేయడానికి రెడీ అయ్యారు. కానీ ఆంధ్రాలో అఖండ మెజార్టీ సాధించిన జగన్ అటువైపు చూడకపోవడం విశేషమనే చెప్పాలి..

తాజాగా టీడీపీ టికెట్ దక్కక మోసపోయి ఎన్నికలకు దూరంగా ఉన్న చాలా మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారట.. కానీ వారికి జగన్ ద్వారాలు తెరువకపోవడం విశేషంగా మారింది. ప్రజలు మనకు మంచి మెజారిటీ ఇచ్చారని.. 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారని.. ప్రభుత్వం ఏర్పడి కొద్దిరోజులకే ఫిరాయింపులను ప్రోత్సహిస్తే తప్పుడు సంకేతాలు వెలుతాయని పార్టీలో చేరికలకు నో చెబుతున్నారట..

ఇక రెండేళ్ల వరకు టీడీపీ నేతలను చేర్చుకునే అవకాశాలు లేవని సమాచారం. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు చేరుదామనుకుంటే జగన్ రూల్ ప్రకారం రాజీనామా చేసి రావాలి.. ఇప్పటికే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని మునిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడా సాహసం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపే ఉంది. తాజాగా దివాకర్ రెడ్డి సోదరులు - కడపలో ఓడిపోయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిలు బీజేపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారు. జగన్ కు ప్రత్యర్థులైన వీరు వైసీపీలోకి రావడం కల్లా. అందుకే తమకు తాము రక్షణ కోసం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా వైసీపీ అధినేత జగన్ నీట్ పాలిటిక్స్ తో ఓడిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.