Begin typing your search above and press return to search.
ఏపీలో స్థానిక ఎన్నికలకు జగన్ నో
By: Tupaki Desk | 27 Oct 2020 6:15 AM GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ సీఎం జగన్ ఎపిసోడ్ వార్ కొనసాగుతోంది. ఇప్పట్లో ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.
ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సీఎం జగన్ ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత నిమ్మగడ్డ తొలగింపు.. ఆయన కోర్టుకెక్కి తిరిగి నియామకం అయ్యారు.
కాగా నిమ్మగడ్డ రమేశ్ నేతృత్వంలో ఏపీలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా లేనట్టు సమాచారం. ఇక కోర్టులో విచారణ సందర్భంగా ఏపీ ఎన్నికల కమిషనర్ ను ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ గురించి నిమ్మగడ్డ తాజాగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిని బహిష్కరించాలని వైసీపీ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్లాన్ బిని కూడా జగన్ సర్కార్ రెడీ చేస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. సోమవారం రాత్రి హుటాహుటిన కరోనా వైరస్ నివారణపై ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ భేటిని ఏర్పాటు చేసింది. ఈ భేటిలో కరోనా గురించి కాకుండా స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే ధ్యేయంగా చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించడమే ఈ ఊహాగానాలకు కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ పరంగా కౌంటర్ వేసేందుకు కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించడం కష్టమని చెప్పేందుకే ఎస్వోపీ భేటి ఏర్పాటు చేసి ఉంటారని ప్రచారం సాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ నిమ్మగడ్డకు, సీఎం జగన్ కు మధ్య కోల్డ్ వార్ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.