Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బ్యాచ్ పోరాటం ఆగ‌దు.. సా..గుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   13 Oct 2015 2:36 PM GMT
జ‌గ‌న్ బ్యాచ్ పోరాటం ఆగ‌దు.. సా..గుతుంద‌ట‌
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ తో నిర‌వ‌ధిక దీక్ష చేప‌ట్టిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గురించి తెలిసిందే. ఏడు రోజులపాటు సాగిన ఆయ‌న దీక్ష‌ను మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పోలీసుల జోక్యంతో బ‌ల‌వంతంగా విర‌మింప‌చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు చికిత్స జ‌రుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నేత‌లు స‌మావేశ‌మై.. ఏపీ ప్ర‌త్యేక హోదాపై కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు.

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించే వ‌ర‌కూ ద‌శ‌ల వారీగా త‌మ పోరాటాన్ని జ‌రుపుతుంటామ‌ని.. వెన‌క్కి త‌గ్గేది లేద‌ని పార్టీ ప్ర‌క‌టించింది. బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని పీడ‌బ్ల్యూ గ్రౌండ్ నుంచి ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం వ‌ర‌కూ నిర‌స‌న మార్చ్ జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ నిర‌స‌న మార్చ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. అభిమానులు భారీగా పాల్గొంటార‌ని పార్టీ నేత‌ అంబ‌టి రాంబాబు ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. రానున్న రోజుల్లో మ‌రిన్ని నిర‌స‌న‌ల‌కు సంబంధించిన వివ‌రాల్ని పార్టీ ప్ర‌క‌టించింది. దీనిప్ర‌కారం బుధ‌వారం నిర‌స‌న మార్చ్ జ‌ర‌గ‌గా.. ఈ నెల 17 నుంచి 21 వ‌ర‌కు ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో రిలే నిరాహార దీక్ష‌లు చేస్తామ‌ని.. 18న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ర్యాలీలు.. 19న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల ముందు ధ‌ర్నాలు.. 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ.. 21న బ‌స్సు డిపోల ముందు ధ‌ర్నాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.